E-Paper
Advertisement

iPone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

iPone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!
Advertisement

Flipkart Black Friday Sale 2026: ఐఫోన్ కొనాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బ్లాక్ ఫ్రైడే సేల్ 2026’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 21 నుంచి మొదలైన ఈ సేల్ నవంబర్ 27 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా యాపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ iPhone 17పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ధర తగ్గింపు వివరాలు..

ధరల పెరుగుదల తర్వాత iPhone 17 అసలు ధర రూ.99,900గా ఉంది. అయితే ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ నేరుగా 11 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీనివల్ల ఈ ఫోన్ ధర రూ.89,100కి తగ్గింది. ఈ ఆఫర్ 256GB బేస్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. బ్లాక్, లావెండర్, వైట్, మిస్ట్ బ్లూ, సేజ్ గ్రీన్ అనే ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.

బ్యాంక్, యూపీఐ ఆఫర్లు..

Advertisement

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా మరో రూ.4,000 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.85,100కే వచ్చేస్తుంది. ఒకవేళ ఈ బ్యాంక్ కార్డులు లేకపోయినా నిరాశ పడాల్సిన అవసరం లేదు. గూగుల్ పే, ఫోన్‌పే, క్రెడ్ లేదా సూపర్‌మనీ యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేస్తే అదనంగా రూ.1,101 డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: జియో యూజర్లు ఎగిరి గంతేసే ప్లాన్.. రూ.1000 రీఛార్జ్ చేస్తే రూ.1000 వోచర్లు, ఏడాది పాటు Canva Pro ఫ్రీ!

iPhone 17 ప్రత్యేకతలు:

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో చిన్న డైనమిక్ ఐలాండ్‌తో కూడిన 6.3-ఇంచుల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం శక్తివంతమైన 3nm ఆధారిత A19 ప్రాసెసర్‌ను అమర్చారు. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 18MP కెమెరా ఇచ్చారు. ఇది iOS 26 తో పాటు కొత్త iOS 27 అప్‌డేట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు కొనడం మంచిదేనా?

ప్రస్తుతం మార్కెట్లో మెమొరీ కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త iPhone 18 సిరీస్ రావడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి.. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో లభిస్తున్న భారీ తగ్గింపుతో అత్యుత్తమ ఫీచర్లున్న iPhone 17 కొనుగోలు చేయడం చాలా మంచి నిర్ణయం అవుతుంది.

Also Read: 10 నిమిషాల్లో డెలివరీ, రూ.22,000 తగ్గింపు.. Motorola Edge 70 Fusionపై క్రేజీ బ్లాక్ ఫ్రైడే డీల్!

Tags

Related News

జియో యూజర్లు ఎగిరి గంతేసే ప్లాన్.. రూ.1000 రీఛార్జ్ చేస్తే రూ.1000 వోచర్లు, ఏడాది పాటు Canva Pro ఫ్రీ!

10 నిమిషాల్లో డెలివరీ, రూ.22,000 తగ్గింపు.. Motorola Edge 70 Fusionపై క్రేజీ బ్లాక్ ఫ్రైడే డీల్!

అచ్చం మన పక్కంటి వాళ్లు దారి చెప్పినట్టే చెప్తోంది.. Apple Mapsలో వచ్చిన ఈ 3 కొత్త అప్డేట్స్ చూశారా?

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ధమాకా..65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

జియో నుంచి క్రేజీ రీఛార్జ్ ప్లాన్.. 98 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5G డేటా.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్!

వెడల్పాటి స్క్రీన్,క్రేజీ ఏఐ ఫీచర్లతో..మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నస్మార్ట్‌ఫోన్!

అంధులకు కళ్లుగా మారనున్న గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్.. ప్రైవసీ సేఫ్టీతో పాటు అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×