Shahid Afridi On IND VS PAK: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడింది. చివరి వరకు తిలక్ వర్మ పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇందులో విజయం సాధించిన పాకిస్తాన్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్ లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించడంపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi On IND VS PAK) తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు.
టీమిండియా కంటే పాకిస్తాన్ చాలా బలమైందని మరోసారి నిరూపితమైందంటూ వ్యాఖ్యానించాడు. తాను మొదటి నుంచి ఇదే చెబుతున్నానని.. టీమిండియాను ఓడించే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశాడు. సరైన సమయంలో ప్లేయర్లు రాణిస్తే, టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడించగలుగుతామని పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ అదే జరిగిందని తెలిపాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ లోనే కాదు, రేపు జరిగే 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియాను ఘోరంగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ లాంటి భయంకరమైన ఆటగాళ్లు టీమిండియా జూనియర్ జట్టులో ఉన్నప్పటికీ పాకిస్తాన్ విజయం సాధించింది అంటే గొప్ప విషయమని షాహిద్ అఫ్రిదిని ప్రశంసించాడు. 30 సంవత్సరాలు దాటిన వాళ్లను కూడా ఈ టోర్నమెంట్ లో బీసీసీఐ బరిలోకి దింపిందని.. అయినప్పటికీ మా కుర్రాళ్ళు అద్భుతంగా రాణించి వాళ్ళను ఓడించారని పరువు తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ పాకిస్తాన్ చాలా దీటుగా సమాధానం ఇచ్చిందని.. అందుకే టీమిండియా కొట్టుకుపోయిందని హేళన చేశాడు.
భవిష్యత్తులో టీమిండియాతో ఏ మ్యాచ్ జరిగినా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించాడు. ఇకపై పాకిస్తాన్ తో ఆడాలంటే టీమిండియా ప్లేయర్లు వణికి పోతారని బాంబు పేల్చాడు. ఇది ఇలా ఉండగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జూనియర్ జట్ల మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. ఇందులో 49.2 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ 313 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా తడబడి.. 49.1 ఓవర్ లో ఆడి 265 పరుగులకు కుప్పకూలింది. దీంతో 48 పరుగుల తేడాతో ఇండియా పై పాకిస్తాన్ విజయం సాధించింది.