Huawei OSTA O1 Pro: హువావే తన కొత్త స్మార్ట్ ఫోన్, ఓస్టా ఓ1 ప్రోను చైనాలో విడుదల చేసింది.ఇది ప్రపంచంలోనే.. మొట్టమొదటి మడవలేని వైడ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ దీనిని పేర్కొంటోంది. ఇందులో 16:9.5 యాస్పెక్ట్ రేషియోతో 6.39-ఇంచుల 1.5K డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ, 200MP ప్రైమరీ కెమెరా, కంపెనీ సొంత కిరిన్ 9030S ప్రాసెసర్ ఉన్నాయి. దీని ప్రారంభ ధర 5,499 యువాన్లు (సుమారుగా రూ.76,500)గా కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా..
హువావే ఓస్టా ఓ1 ప్రోలోని బెస్ట్ ఫీచర్ దాని వైడ్ స్క్రీన్ డిజైన్. కంపెనీ దీనిని మడతపెట్టలేని వైడ్‌స్క్రీన్ ఫోన్ కొత్త కేటగిరీగా పరిచయం చేసింది. ఇది 16:9.5 యాస్పెక్ట్ రేషియోతో 6.39-ఇంచుల 1.5K ఎల్టీపీఎస్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలకు భిన్నంగా ఉంటుంది.ఫోన్ వెనక ప్యానెల్‌లో అడ్డంగా డ్యూయల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. అంతే కాకుండా వెనుక భాగంలో OSTA బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్టారీ బ్లాక్, నెబ్యులా వైట్ , స్టార్‌బర్స్ట్ పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంది.
ఫోటోగ్రఫీ కోసం, ఈ హువావే ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 1/1.28-ఇంచుల RYYB సెన్సార్‌తో కూడిన 200ఎంపీ కెమెరా. దీనికి జతగా 3.7x ఆప్టికల్ జూమ్‌తో 50MP RYYB పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. ఈ కెమెరా సిస్టమ్‌లో రెడ్ మేపుల్ లెన్స్ కూడా ఉంది.
హువావే ఓస్టా ఓ1 ప్రో, కంపెనీ సొంత కిరిన్ 9030S చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12జీబీ, 16జీబీ ర్యామ్, అలాగే 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ అనే నాలుగు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తోంది.అంతే కాకుండా ఈ ఫోన్‌లో 7,000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 66వాట్ల వైర్డ్ ఛార్జింగ్ , వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీతో..కంపెనీ దీనిని దీర్ఘకాలిక ఉపయోగం కోసం రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌గా ప్రచారం చేస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ హార్మొనీఓఎస్ 7 ఏఐ పయనీర్ ఎడిషన్‌పై పని చేస్తుంది. హువావే దీనిని ఏఐ ఫోన్ అని పిలుస్తోంది. కంపెనీ ప్రకారం..ఇందులో సిస్టమ్-స్థాయి ఏఐ ఫీచర్లు ఉంటాయి. అదనంగా.. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ , క్లౌడ్ మధ్య సమన్వయం కోసం కిరిన్ 9030ఎస్ చిప్‌సెట్‌ను రూపొందించారు.
Also Read: రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్
12GB + 256GB (బేస్ వేరియంట్): 5,499 యువాన్లు (సుమారు రూ.76,500)
12GB + 512GB వేరియంట్:6,499 యువాన్లు (సుమారుగా రూ.90,330)
16GB + 512GB వేరియంట్:7,299 యువాన్లు (సుమారుగా రూ.1,01,458)
16GB + 1TB (టాప్ వేరియంట్):8,799 యువాన్లు (సుమారుగా రూ.1,22,309)