E-Paper
Advertisement

అంధులకు కళ్లుగా మారనున్న గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్.. ప్రైవసీ సేఫ్టీతో పాటు అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?

అంధులకు కళ్లుగా మారనున్న గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్.. ప్రైవసీ సేఫ్టీతో పాటు అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?
Advertisement

Google Intelligent Eyewear: స్మార్ట్ గ్లాసెస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్. ఫోన్ తీయాల్సిన పని లేకుండానే ఫొటోలు క్లిక్ మనిపించడం, ఏఐ అసిస్టెంట్‌తో ప్రపంచాన్ని తెలుసుకోవడం నిజంగా సూపర్ ఐడియా. కానీ, ఈ టెక్నాలజీ వెనుక ఒక పెద్ద ప్రైవసీ సమస్య ఉంది. పక్కన ఉన్నవారికి తెలియకుండా రికార్డింగ్ చేస్తారనే అనుమానం, యూజర్ల డేటా సేఫ్టీపై సందేహాలు చాలామందిని వెనక్కి లాగుతున్నాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నింటికీ పక్కా పరిష్కారం చూపిస్తూ.. గూగుల్ తమ కొత్త ఇంటెలిజెంట్ ఐవేర్ స్మార్ట్ గ్లాసెస్‌ను రంగంలోకి దించుతోంది.

డేటా సేఫ్టీకి గూగుల్ భరోసా..

గూగుల్ తీసుకొస్తున్న ఈ కొత్త గ్లాసెస్ వాడేవారి ప్రైవసీకి పూర్తి భద్రత ఇస్తాయి. మనం ఏదైనా పక్షిని చూసి దాని వివరాలు జెమినీని అడిగామనుకోండి.. సమాధానం చెప్పగానే ఆ విజువల్ డేటాను జెమినీ తన హిస్టరీలో సేవ్ చేసుకోదు. అంతేకాదు, మనం చూసే దృశ్యాలను ఏఐ ట్రైనింగ్ కోసం గానీ, యాడ్స్ చూపించడం కోసం గానీ వాడదు. క్లౌడ్ లేదా ఇతర డివైజ్‌లకు వెళ్లే డేటా కూడా పూర్తిగా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది.

ఎదుటివారి ప్రైవసీకి కూడా రక్షణ..

Advertisement

ఈ గ్లాసెస్ పెట్టుకున్న వారి వల్ల చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గూగుల్ జాగ్రత్తలు తీసుకుంది. గ్లాసెస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎదుటివారికి తెలిసేలా ఒక ఎల్ఈడీ లైట్ వెలుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఆ లైట్‌ను కవర్ చేస్తే కెమెరా వెంటనే ఆగిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, జెమినీ ఏఐ పనిచేస్తున్నప్పుడు ఫ్రేమ్‌లో కనిపించే ఇతరుల ముఖాలను ఈ గ్లాసెస్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తాయి.

Also Read: రూపాయి ఖర్చు లేదు.. వాటర్ ట్యాంక్‌కు ఇదొక్కటి చుడితే చాలు.. ఎముకలు కొరికే చలిలోనూ గోరువెచ్చని నీళ్లు!

అదిరిపోయే జెమినీ స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

మెటా రే-బాన్ గ్లాసెస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఇందులో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఉదా: మీరు సూపర్ మార్కెట్‌లో ఒక కూరగాయను చూస్తే.. దాంతో ఏం వంటకాలు చేయవచ్చో జెమినీ వెంటనే చెబుతుంది. జీపీఎస్ ద్వారా ఆడియో డైరెక్షన్లు ఇస్తుంది. కంటిచూపు మందగించిన వారికి, అంధులకు సాయపడేలా ‘గైడెడ్ విజన్’ ఫీచర్ ఇందులో ఉంది. ఇది చుట్టుపక్కల దృశ్యాలను వర్ణించి చెప్పడంతో పాటు, ఎదురుగా ఉన్న అక్షరాలను చదివి వినిపిస్తుంది.

ధర ఎంతంటే?

శాంసంగ్, వార్బీ పార్కర్, జెంటిల్ మాన్‌స్టర్ కంపెనీలతో కలిసి గూగుల్ ఈ గ్లాసెస్‌ను తయారు చేసింది. వార్బీ పార్కర్ మోడల్స్ ధర సుమారు రూ.36,700 నుంచి, జెంటిల్ మాన్‌స్టర్ మోడల్స్ ధర సుమారు రూ.41,700 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10, 2026 నుంచి ఇవి మార్కెట్లోకి రానున్నాయి. అయితే జెంటిల్ మాన్‌స్టర్ గ్లాసెస్ ప్రస్తుతానికి అమెరికా, దక్షిణ కొరియాలో మాత్రమే లభిస్తాయి.

Also Read: స్క్రీన్‌ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!

Tags

Related News

తక్కువ ధరలో ప్రీమియం సౌండ్ కావాలా? మార్కెట్‌లో దుమ్మురేపుతున్న లేటెస్ట్ ఇయర్‌బడ్స్..

ఇక టీవీలు పక్కన పెట్టేయండి..ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్లతో 150 ఇంచుల స్క్రీన్‌!

రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్

సౌండ్‌బార్ పక్కన పెట్టేయండి,రూ.22,999కే అసలైన థియేటర్ సౌండ్ !

రూ.5,509కే.. ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ స్పీకర్, డోంట్ మిస్

రూపాయి ఖర్చు లేదు.. వాటర్ ట్యాంక్‌కు ఇదొక్కటి చుడితే చాలు.. ఎముకలు కొరికే చలిలోనూ గోరువెచ్చని నీళ్లు!

స్క్రీన్‌ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!

Big Stories

Advertisement
×