Jio 1000 Recharge Plan: మొబైల్ రీఛార్జ్ అంటే కాల్స్, డేటా మాత్రమే కాదు.. డిజిటల్ సేవలు కూడా ఉచితంగా లభిస్తే ఎలా ఉంటుంది? జియో ఇప్పుడు ఇలాంటి ప్రత్యేక ఆఫర్‌నే అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.1,000తో ఏడాది పాటు Canva Pro, JioShield సబ్‌స్క్రిప్షన్లతో పాటు రూ.1,000 విలువైన రీఛార్జ్ వోచర్లు కూడా అందిస్తోంది. అంతేకాదు.. 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో సాధారణ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. మరి ఈ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఎవరికి ఉపయోగపడుతుంది? వంటి వివరాలు తెలుసుకుందామా..
జియో తీసుకొచ్చిన ఈ రూ.1,000 ప్యాక్‌లో ముఖ్యమైన బెనిఫిట్ ఏడాది వ్యాలిడిటీ. అంటే 365 రోజుల పాటు ఇందులో ఇచ్చే సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా Canva Pro, JioShield సేవలకు 12 నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఇది సాధారణ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ కాదు. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ ఎస్ఎంఎస్‌లు ఉండవు. డిజిటల్ సేవలు కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ ప్లాన్‌తో ఏడాది పాటు Canva Pro ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, బ్యానర్లు, ప్రెజెంటేషన్లు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉచిత వెర్షన్‌తో పోలిస్తే ప్రోలో మరిన్ని డిజైన్ టూల్స్, అదనపు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపారాలు నిర్వహించే వారికి ఇది ఉపయోగపడుతుంది.
Also Read: 10 నిమిషాల్లో డెలివరీ, రూ.22,000 తగ్గింపు.. Motorola Edge 70 Fusionపై క్రేజీ బ్లాక్ ఫ్రైడే డీల్!
ఈ ప్యాక్‌లో JioShield సబ్‌స్క్రిప్షన్ కూడా 12 నెలల పాటు లభిస్తుంది. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల డిజిటల్ కార్యకలాపాలను తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే లొకేషన్ అలర్ట్స్, ఫోన్ వాడకాన్ని నియంత్రించే స్క్రీన్ టైమ్ కంట్రోల్, అత్యవసర సమయంలో ఉపయోగపడే SOS అలర్ట్స్ ఇందులో ఉన్నాయి.
ఈ ప్లాన్‌లో మొత్తం రూ.1,000 విలువైన జియో రీఛార్జ్ వోచర్లు వస్తాయి. వీటిని రూ.100 చొప్పున 10 వోచర్లుగా అందిస్తారు. అయితే రూ.399 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న అర్హత కలిగిన అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లకు మాత్రమే వీటిని ఉపయోగించాలి. MyJio యాప్ ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా లభిస్తుంది. దీనికి జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉండటంతో పాటు అర్హత ఉండాలి.
Also Read: అచ్చం మన పక్కంటి వాళ్లు దారి చెప్పినట్టే చెప్తోంది.. Apple Mapsలో వచ్చిన ఈ 3 కొత్త అప్డేట్స్ చూశారా?