BigTV English

Discount on Vivo T3x 5G: మన కోసమే ఈ బంపర్ ఆఫర్.. వివో 5జీ ఫోన్‌పై రూ.5వేల డిస్కౌంట్!

Discount on Vivo T3x 5G: మన కోసమే ఈ బంపర్ ఆఫర్.. వివో 5జీ ఫోన్‌పై రూ.5వేల డిస్కౌంట్!

Rs 5,000 Discount on Vivo T3x 5G: ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే కొనాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఆ ధరలోనే ప్రీమియం ఫీచర్లు ఉండాలని భావిస్తున్నారు. అలానే మొబైల్స్‌ను ఆఫర్లపై కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపుతున్నారు. బడ్జెట్ ప్రైస్‌లో మంచి ఫోన్ ఎక్కడ దొరుకుతుందని వెతికేస్తున్నారు.


ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారా? అయితే మీకో అదిరిపోయే శుభవార్త ఉంది. అదేంటంటే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు వివో T3x 5G ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. కాబట్టి ఈ ఫోన్ ఫీచర్లు, దానిపై ఉన్న ఆఫర్లు గురించి వివరంగా తెలుసుకుందాం.

Vivo T3x 5G Offers
Vivo T3x 5G బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 17,499గా ఉంది. దీనిపై ఇప్పుడు 22 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఫోన్ ధర రూ. 4000 తగ్గుతుంది. అలానే అదనంగా రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. మొత్తంగా ఈ 5జీ ఫోన్‌పై రూ.5000 వరకు తగ్గింపు లభిస్తుంది.


Also Read: Best Mobile Phones Under 25000: బెస్ట్ ఫోన్లు.. ఎక్స్‌లెంట్ కెమెరా, బ్యాటరీ.. ధర కూడా తక్కువే!

ఇప్పుడు మీరు రూ. 12,499కి ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు నెలకు రూ. 4,500 నో-కాస్ట్ EMIని ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ సెలెస్టియల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Vivo T3x 5G Specifications
ఈ Vivo స్మార్ట్‌ఫోన్ Snapdragon6 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో ఇంటర్నల్ స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది.

Also Read: Redmi Note 13 Pro Plus 5G: షియోమీ స్పెషల్ సేల్.. 200 MP కెమెరా ఫోన్‌పై బెస్ట్ డీల్.. డిస్కౌంట్ ఎంతంటే?

Vivo T3X 5G స్మార్ట్‌ఫోన్  6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే  1000 నిట్‌లు పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. కెమెరా పరంగా ఈ ఫోన్ అత్యుత్తమమైనది. ఇది ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 2-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Related News

Nokia 800 Tough: 6 ఏళ్ల తరువాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న నోకియా టఫ్ ఫోన్.. కొత్త అప్‌గ్రేడ్లతో సూపర్ కమ్‌బ్యాక్

Vivo V60e: మిడ్ రేంజ్ ఫోన్‌లో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీ… వివో వి60e లాంచ్

Amazon Diwali Sale: రూ47999కే ఐఫోన్ 15, వన్‌ప్లస్, శాంసంగ్‌పై బంపర్ డిస్కౌంట్లు.. అమెజాన్ దీపావళి బొనాన్జా సేల్

Itel A100C: నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ కాలింగ్.. ఇండియాలో ఐటెల్ తక్కువ బడ్జెట్ ఫోన్ లాంచ్

iphone 17 Discount: ఐఫోన్ 17పై తొలిసారి డిస్కౌంట్.. తక్కువ ధరలో తాజా ఫ్లాగ్‌షిప్‌.. ఎక్కడంటే?

Smartphone Comparison: గెలాక్సీ A07 vs లావా బోల్డ్ N1 vs టెక్నో పాప్ 9.. ₹10,000 కంటే తక్కువ ధరలో ఏది బెస్ట్?

Galaxy S25 Ultra Discount: గెలాక్సీ ప్రీమియం ఫోన్‌పై బ్లాక్‌బస్టర్ ఆఫర్.. S25 అల్ట్రాపై ఏకంగా రూ.59000 తగ్గింపు!

Phone EMI Default: ఈఎంఐలో ఫోన్ కొనుగోలు చేసి పేమెంట్ చేయలేదా?.. ఆర్బిఐ బిగ్ వార్నింగ్

Big Stories

×