E-Paper
Advertisement

KP Sharma Oli as Nepal PM: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి..

KP Sharma Oli as Nepal PM: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి..
Advertisement

KP Sharma Oli was appointed as a Nepal’s Prime Minister: నేపాల్ దేశ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి నియమితులయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ(69) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం విధితమే. నేపాల్ పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలి(72) నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్(ఎన్ సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల(సీపీఎన్-యూఎంఎల్-77, ఎన్ సీ-88) కు సంబంధించిన సంతకాలను ఓలి సమర్పించారు.

మొత్తం 275 సీట్లున్న సభలో విశ్వాసం తీర్మానం నెగ్గడానికి 138 ఓట్లు కావాల్సి ఉంది. అయితే, ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. నేపాల్ కొత్త ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. ఓలితో పాటు కొత్త మంత్రివర్గం రేపు(సోమవారం) ప్రమాణస్వీకారం చేయనున్నది. అయితే, కొన్ని రోజుల క్రితమే ఓలి, దేవ్ బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీని ప్రకారం తొలి 18 నెలలు ఓ లి ప్రధానిగా ఉండనున్నారు. ఆ తరువాత పార్లమెంటు ముగిసేవరకూ దేవ్ బా ప్రధానిగా కొనసాగనున్నారు. కాగా, ఓలి ఇదివరకే రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×