Illu Illalu Pillalu Today Episode October 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ఆనందరావు కాలు తొక్కుతుంది. దాంతో ఆనందరావు గుండెపోటు వచ్చినట్టు నటిస్తాడు. నాటకాన్ని రక్తి కట్టించేలా మేము హాస్పిటల్ కి వెళ్ళాలి అని భాగ్యం అంటుంది. ఇక బయటికి అర్జెంటుగా తీసుకొని వచ్చేస్తారు ఆటోలోకి రాగానే అల్లుడుగారు దీని తప్పు లేదండి మా అమ్మాయిని తప్పుగా చూడకండి అని భాగ్యం అంటుంది. ఇక ఆ ఇల్లు దాటిన తర్వాత ఆనందరావు నాటకాన్ని ఆపేస్తాడు. మన ప్లాన్ వర్కౌట్ అయింది అని సంతోష పడతారు అప్పుడే ఆటో డ్రైవరు ఆటోని ఆపేస్తాడు.. మీ చావు తెలివితేటలు నా దగ్గర చూపించకండి. ఎదురింటి వాళ్లతో కలిసి మా ఇంటి నేను నాశనం చేయాలని చూస్తే నేను అస్సలు సహించను ఇది గుర్తుపెట్టుకోండి అని నర్మదా బాగ్యం కు వార్నింగ్ ఇస్తుంది.. ప్రేమకూ శ్రీవల్లి నిజం చెప్తుంది. మాట వినగానే ప్రేమ కోపంతో రగిలిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బయట ఒంటరిగా కూర్చున్న ప్రేమను చూసిన నర్మద మనిషి ఇక్కడుంది మనసు ఎక్కడో ఉంది. ఏంటి సంగతి అని ప్రేమను అడుగుతుంది నర్మద.. అస్సలు విషయాన్ని ప్రేమ నర్మదతో చెప్తుంది. ధీరజ్ నన్ను కిస్ చేసాడో లేదో తెలియలేదు అక్క అని ప్రేమ అంటుంది. నిన్ను ముద్దు పెట్టుకున్నాడో లేదో తెలియనంత అమ్మాయి ఏకంగా ఉన్నావా ఏంటి అని నర్మద అడుగుతుంది. నేను కాస్త డ్రింక్ చేశాను కదా అక్క అందుకే నాకేం తెలియలేదు. ధీరజ్ నిజంగానే నన్ను ముద్దు పెట్టుకున్నాడో లేదో తెలియాలి అని ప్రేమ అనుకుంటుంది. ముద్దు పెట్టుకున్నాడో లేదో నువ్వే అడిగి తెలుసుకోవా ప్లీజ్ అని నర్మదని రిక్వెస్ట్ చేస్తుంది ప్రేమ. ఏం మాట్లాడుతున్నావ్ ఇలాంటివన్నీ నేను ఎలా అడగాలి అని నర్మదా అంటుంది. ధీరజ్ రావడం చూసి అక్క నువ్వు అడగాలి అక్క అనేసి వెళ్ళిపోతుంది ప్రేమ.
ధీరజ్ వెళ్ళిపోతుంటే నర్మదా ఆపుతుంది. మొన్న మీరు బ్యాచిలర్ పార్టీకి వెళ్లారు కదా బాగా జరిగిందా అని అడుగుతుంది. నువ్వు ప్రేమ ఫంక్షన్లో ఏదో చేశారంట కదా అనగానే ధీరజ్ దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతాడు.. బాగా ఎంజాయ్ చేసాం వదిన అని ధీరజ్ అంటాడు. అప్పుడు నర్మదా గుచ్చి గుచ్చి అడుగుతుంటే అక్కడ తలుపు చాటున ప్రేమను చూసిన ధీరజ్ ఏమి చెప్పకుండా ఇది నా చాతకి చెప్పించాలి అనుకుంటుందని అనుకుంటాడు. నాన్న పిలుస్తున్నాడు అని అక్కడ వచ్చేస్తాడు.
ఇక అందరూ కలిసి ఇంట్లో బతుకమ్మ సంబరాలను మొదలు పెడతారు. ముగ్గురు కోడళ్ళు కలిసి బతుకమ్మను తయారుచేస్తారు. బతుకమ్మ గురించి వేదవతి చెప్పడంతో తిరుపతి నా అర్ధాంగి ఎక్కడ బతుకమ్మ అని పెడుతుందో.. నా కోసం ఎక్కడ వెతుకుతుందో అని అంటాడు.. నిన్నెవరు కోరుకోరు.. నీకు ఈ జన్మలో ఇక పెళ్లి కాదు అని రామరాజు అంటాడు. ఆ మాట వినగానే తిరుపతి కోపంతో అల్లుళ్ళ దగ్గరికి వెళ్లి.. నాకు పెళ్లి అవ్వదు అంటే మీ నవ్వుతున్నారు కదా ఇప్పుడు బతుకమ్మ విషయంలో మీ పిల్లలు ఎలా ఇరుక్కిస్తారో చూడండి అని అంటాడు.
ఇక ముగ్గురు కోడలు కలిసి మా బతుకమ్మలో ఎవరి బతుకమ్మ బాగుంది అని అడుగుతారు. ఇలాంటి విషయాల్లో తలపండిన నాన్నగారు చెప్తేనే బాగుంటుంది అని రామరాజును ఇరికిస్తారు. ఏం చెప్తే ఏం బాగుంటుందిరా.. మీ ఆవిడలో చేసిన బతుకమ్మ గురించి మీరే చెప్పండి అని రామరాజు తెలివిగా తప్పించుకుంటాడు. ఇక అన్నదమ్ములు కూడా నీ భార్య బాగా చేసిందని నీ భార్య బాగా చేసింది అంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకొని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు.
Also Read : శృతిని ఇరికించిన మీనా.. బాలును చూసి మీనా హ్యాపీ.. తప్పించుకున్న ప్రభావతి..
భద్రావతి తన చెల్లెల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. బతుకమ్మ సంబరాలు మేమిద్దరం కలిసి చేసేవాళ్లం మా ఇంట్లో మా చెల్లెలు లేదు నా మేనకోడలు లేదు.. అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ, వేదవతి ఇద్దరూ కూడా తమ పుట్టింటి గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. నర్మదా ఇద్దరినీ ఓదారుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..