
Gaganyaan Mission Rocket Engine : గగన్‌యాన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. భారత వ్యోమగాములను రోదసిలోకి తీసుకెళ్లే క్రయోజనిక్ ఇంజన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(Isro) జరిపిన పరీక్షలు విజయవంతంగా ముగిశాయి.
క్రయోజనిక్ ఇంజన్ CE20 హ్యూమన్ రేటింగ్‌ను పూర్తి చేసింది. లాంచ్ వెహికల్ మార్క్ 2(LVM3)ను రోదసిలోకి పంపే క్రయోజనిక్ దశలో పవర్‌ను అందజేస్తుందీ ఇంజన్. గగన్‌యాన్ మిషన్ కోసం తొలిసారిగా ఈ భారీ వాహక నౌక భారత వ్యోమగాములను రోదసిలోకి తీసుకెళ్లనుంది.
Read more: రూ.899లకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ లాంచ్.. ఫీచర్లు అద్భుతం..!
వాక్యూమ్ ఇగ్నిషన్ టెస్ట్‌ల పరంపరలో ఇస్రో తాజాగా నిర్వహించిన పరీక్ష ఏడోది. మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ పరీక్ష నిర్వహించారు.
తాజాగా CE20 ఇంజన్ గ్రౌండ్ క్వాలిఫికేషన్ టెస్ట్ విజయవతంతం కావడంతో గగన్‌యాన్ మిషన్‌కు ముందస్తు చేపట్టాల్సిన పరీక్షలన్నీ ముగిసినట్టే. హ్యూమన్ రేటింగ్ ప్రమాణాల నిర్థారణకు మొత్తం 8810 సెకన్ల పాటు 39 హాట్ ఫైరింగ్ టెస్ట్‌లు నిర్వహించారు.