BigTV English

Noise Buds N1 TWS @ Rs 899: రూ.899లకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ లాంచ్.. ఫీచర్లు అద్భుతం!

Noise Buds N1 TWS @ Rs 899: రూ.899లకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ లాంచ్.. ఫీచర్లు అద్భుతం!

Buy Noise Buds N1 true Wireless Earbuds at Rs 899 Only: ప్రముఖ స్వదేశీ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ నాయిస్ తాజాగా భారతదేశంలో ‘నాయిస్ బడ్స్ ఎన్1 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌’ను తీసుకొచ్చింది. వీటిని అతి తక్కువ ధరలోనే కంపెనీ విడుదల చేసింది. కేవలం రూ.899తో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.


కామ్ బీజ్, కార్బన్ బ్లాక్, ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. వీటిని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్‌తో పాటు ఇతర ప్లాట్ ఫార్మ్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ సేల్ ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్‌లో స్టార్ట్ అవుతుంది.

నాయిస్ బడ్స్ ఎన్1 స్పెసిఫికేషన్స్:


ఈ ఇయర్‌ఫోన్‌లు ఇన్-ఇయర్ డిజైన్‌లను కలిగి ఉన్నాయి. దీనిద్వారా వినియోగదారులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ఫిట్‌ను అందిస్తాయి. అలాగే టిడబ్లూఎస్ 11ఎంఎం డ్రైవర్ యూనిట్‌ను ఇది కలిగి ఉంది.

Read More: యాపిల్ లాప్‌టాప్‌పై ఏకంగా రూ.22 వేల తగ్గింపు.. డోంట్ మిస్..!

అలాగే మెరుగైన క్లారిటీతో అదర్భుతమైన ఆడియో పెర్ఫార్మెన్స్‌ను ఇది అందిస్తుంది. ఇవి బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తాయి. అంతేకాకుండా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉండనున్నాయి. ఇవి పర్యావరణ శబ్దాన్ని నివారించడానికి క్వాడ్ మైక్‌లతో వస్తాయి.

అలాగే కాల్స్ సమయంలో వాయిస్‌ను చాలా స్పష్టంగా ఆడియోను అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ IPX5 రేటింగ్‌తో వస్తాయి. ఇయర్‌బడ్‌లు 40 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. 10 నిమిషాల ఛార్జ్‌తో వినియోగదారులు రెండు గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆస్వాదించవచ్చు.

Tags

Related News

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Big Stories

×