BigTV English

AI Model: చాట్‌జీపీటీ కి ప్రత్యర్థి.. భారత్‌లో ‘హనుమాన్‌’ ఏఐ మోడల్‌!

AI Model: చాట్‌జీపీటీ కి ప్రత్యర్థి.. భారత్‌లో ‘హనుమాన్‌’ ఏఐ మోడల్‌!

Artificial Intelligence Model: కృత్రిమ మేధ ( Artificial Intelligence-AI) రంగంలో కీలక పాత్ర పోషిస్తూ భారత కలలు సాకారమయ్యే దిశగా అడుగులు ముందుకు వేసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, పలు ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన భారత్ జీపీటీ వచ్చే నెల చాట్ జీపీటీ తరహా సేవలను ప్రారంభించేందుకు సిద్దమైంది. దీనికి సంబంధించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ను మంగళవారం ముంబయిలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్ లోప్రదర్శించింది.


భారత్ జీపీటీ పనితీరుకు సంబంధించిన వీడియోను భారత్ జీపీటీ ప్రేక్షకుల ముందు ఉంచింది. వీరు రూపొందించిన ఏఐ బాట్ తో ఒ వ్యక్తి తమిళంలో మాట్లాడి సమాధానం రాబట్టారు. ఓ బ్యాంకర్ హిందీలో చాట్ చేశారు. హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఇంజినీరు కంప్యూటర్ కోడ్ ను రాసేందుకు ఉపయోగించారు. ఈ మోడల్ కు హనుమాన్ గా నామకరణం చేసినట్లు సమాచారం.

హనుమాన్ ఏఐ మోడల్ లో మొత్తం 11 స్థానిక బాషల్లో ఇది పని చేస్తుందని తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, గవర్నెన్స్ , ఆర్థిక సేవలు, విద్యా రంగాల్లో ఇది సేవలు అందించనుంది. ఐఐటీలతో పాటు రిలయన్స్ జియో కాన్ఫోకామ్, భారత ప్రభుత్వ సహకారంతో దీన్ని రూపొందించారు.


హనుమాన్ స్పీచ్ టూ టెక్ట్స్ వంటి సేవలను అందిస్తుందని ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి గణేష్ రామకృష్ణన్ వెల్లడించారు. దీన్ని ఆధారం చేసుకొని ప్రత్యేక అవసరాలకు కావాల్సిన మోడళ్లను రిలయన్స్ జియో అభివృద్ది చేస్తుందని చెప్పారు. ఇప్పటికే తమ సబ్ సబ్ స్కైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు జియో బ్రెయిన్ పేరిట రిలయన్స్ ఓ మోడల్ ను తయారు చేస్తోంది. మరో వైపు భారత యూజర్ల అవసరాలకు అనుగుణంగా సర్వం, కృత్రిమ్ వంటి అకుంర సంస్థలు సైతం ఏఐ మోడళ్లను అభివృద్ది చేస్తున్నారు.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×