BigTV English

Bank Of India Farmer Loan: రైతులకు గుడ్ న్యూస్.. కృషి వాహన పథకాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా పండుగ ఆఫర్!

Bank Of India Farmer Loan: రైతులకు గుడ్ న్యూస్.. కృషి వాహన పథకాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా పండుగ ఆఫర్!

Bank Of India Providing Farmer Loan: బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కృషి వాహన పథకాలపై పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ యాంత్రీకరణకు తన వంతగా సహకారం అందిస్తోంది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, రవాణా వాహనాలతో సహా వివిధ వ్యవసాయ అవసరాలకు ఫైనాన్సింగ్ కోసం టర్మ్ లోన్ అందిస్తోంది.


బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు పథకాలపై పండుగ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాలు రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాలును పరిష్కరించే లక్ష్యంతో ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొంది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, రవాణా వాహనాలతో సహా వివిధ వ్యవసాయ అవసరాలకు ఫైనాన్సింగ్ కోసం బ్యాంక్ కృషి వాహన్, ఫార్మ్ మెకనైజేషన్ రుణాలు రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయని బ్యాంకు పేర్కొంది.

కృషి వాహన్ రుణం వాహనం ఎక్స్-షోరూమ్ ధరలో 90 శాతం వరకు వర్తిస్తుంది. ముఖ్యంగా రైతులకు రూ. 25 లక్షల వరకు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు రూ. 1 కోటి వరకు రుణాలను ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా ఇస్తారు. వ్యవసాయ యంత్రాల ఖరీదులో 85 శాతం వరకు రుణంగా లభిస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.


Read More: యాపిల్ లాప్‌టాప్‌పై ఏకంగా రూ.22 వేల తగ్గింపు.. డోంట్ మిస్..!

ఈ పథకాలతో రైతులకు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు అందుతాయి. ఛార్జీలు లేకుండా నేరుగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ వరకు ఈ లోన్‌లకు సరళీకృత దరఖాస్తు ప్రక్రియ చేపట్టారు. త్వరగా రుణం మంజూరు చేస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడమే లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆధునిక వ్యవసాయ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించేలా చేయడమే లక్ష్యమని తెలిపింది. వ్యవసాయ ఆదాయాన్ని, ఉత్పాదకతను పెంపొందించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారని వివరించింది. ఇది వ్యవసాయ భవిష్యత్తు దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×