BigTV English
Advertisement

Google Pixel 8 price : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో కళ్లు చెదిరే ఆఫర్​ – గూగుల్ పిక్సల్​ 8 మరీ ఇంత తక్కువ ధరకా?

Google Pixel 8 price : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో కళ్లు చెదిరే ఆఫర్​ – గూగుల్ పిక్సల్​ 8 మరీ ఇంత తక్కువ ధరకా?

Google Pixel 8 price : గూగుల్​ పిక్సెల్​ 9 లాంఛ్​ అయినప్పటికీ కూడా గూగుల్​ పిక్సెల్​ 8 డిమాండ్​ తగ్గలేదు. చాలా మంది వినియోగదారులు ఈ స్మార్ట్​​ ఫోన్ కొనుగోలు చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు.​ చాలా మంది ఈ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారు. మరి మీరూ కూడా ఈ గూగుల్ పిక్సెల్​ 8ను కొనాలని అనుకుంటున్నారు? అయితే మీ కోసమే అదిరిపోయే డిస్కౌంట్​ ఆఫర్​ను ఫ్లిప్​కార్ట్​ మీ ముందుకు తీసుకొచ్చింది.


బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో భాగంగా గూగుల్​ పిక్సెల్​ 8 గ్యాడ్జెట్​పై భారీ డిస్కౌంట్​ను అందించింది. ఇంకా చెప్పాలంటే ఈ పిక్సెల్​ 8 లాంఛ్ అయిన తర్వాత ఇంత మొత్తంలో ధర తగ్గిపోవడం ఇదే తొలిసారి. మరి గూగుల్ జెమినీ ఆధారిత ఏఐ ఫీచర్లు, టెన్సర్ జీ2 చిప్సెట్, బెస్ట్ కెమెరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్​ ధర ఎంత? దాని స్పెసిఫికేషన్స్​ ఏంటి తెలుసుకుందాం.

Google Pixel 8 price Rs. 36,999 – ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో భాగంగా ఈ గూగుల్​ పిక్సెల్ 8 ధర. రూ.36,999గా ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​కు ఈ ధర నిర్ణయించారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్​తో పేమెంట్ చేస్తే రూ.2,000 వరకు డిస్కౌంట్ దొరుకుంది. అంటే ఈ ఫోన్​ను రూ.35,000 కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ గూగుల్ 8 పిక్సల్​ ధర లాంఛ్ అయినప్పుడు రూ.75,999గా ఉంది. కాబట్టి కొత్త డిస్కౌంట్​తో కలిపి రూ.40,000 లోపు కొనడానికి ఈ ఫోన్​ బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా మంచి కెమెరా కావాలనుకునేవారికి ఈ డీల్​ వెరీ బెస్ట్.


ALSO READ : ఇదేం సేల్ అయ్యా బాబు.. మరీ ఇంత చీపా.. రూ.500లోపే ఎన్ని గాడ్జెట్స్​ కొనొచ్చో!

Google Pixex 8 Specifications – గూగుల్ పిక్సెల్ 8​లో 6.2 ఇంచ్​ డిస్​ ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 428 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్​ స్క్రీన్ ఆకట్టుకునే 2000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ను సపోర్ట్​ చేస్తుంది. అలాగే ఫ్రెంట్ అండ్​ బ్యాక్​​​ రెండింటిలోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది.

గూగుల్ పిక్సెల్ 8లో హైక్వాలిటీ కెమెరా కూడా ఉంది. 50 మెగా పిక్సెల్ పీడీ వైడ్ ప్రైమరీ సెన్సార్, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10.5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేసేలా 4,575 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంకా ఈ పిక్సెల్ 8లో సరి కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, డస్ట్ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​ కోసం IP68 రేటింగ్​ను కలిగి ఉంది.

ఇకపోతే ఈ పిక్సెల్ 8 స్మార్ట్​ఫోన్ టెన్సర్ జీ3 ప్రాసెసర్​పై నడుస్తుంది. పాత టెన్సర్ జీ2తో పోలిస్తే మరింత వేగంగా, మెరుగైన సామర్థ్యంతో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్​ కెపాసిటీని కలిగి ఉంది.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×