Smartphones : ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ పై అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో టాప్ బ్రాండ్ మొబైల్స్ పై దిమ్మతిరిగే డీల్స్ ను అందించిన ఫ్లిప్కార్ట్.. తాజాగా గూగుల్ పిక్సెల్ 8a (Google Pixel 8a) మొబైల్ పై ఊహించని భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ మొబైల్ ను ఆఫర్లో కొనుగోలు చేస్తే.. రూ.18వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఆపిల్, సాంసంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై అండ్ కెమెరా ఫీచర్స్ తో ప్రీమియం మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న నేపథ్యంలో.. గూగుల్ సైతం తన స్పీడ్ పెంచేసి పిక్సెల్ మొబైల్స్ ను అదిరిపోయే అప్డేట్స్ తో తీసుకువచ్చేస్తుంది. ఇప్పటికే గూగుల్ పిక్సెల్ అదిరిపోయే అప్డేట్స్ తో ముందు వరుసలో ఉండగా.. ఈ సంస్థ తీసుకొచ్చిన గూగుల్ పిక్సెల్ 8A మొబైల్ లో సైతం లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మొబైల్ పై ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది. నిజానికి ఈ మొబైల్ అసలు ధర రూ.52000 ఉండగా ఆఫర్ లో రూ.35000కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
హై ఎండ్ ఫీచర్స్ తో లాంఛ్ అయిన ఈ మొబైల్ ప్రస్తుతం బెస్ట్ మిడ్ రేంజ్ మొబైల్ గా ఆఫర్ లో లభిస్తుంది. ప్రీమియం సెగ్మెంట్ లో లాంఛ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఛాయిస్. నిజానికి గూగుల్ పిక్సెల్ లాంఛ్ అయినప్పుడు రూ.52999గా ఉంది. ఇప్పుడు ఆఫర్ లో భాగంగా రూ.35000కే ఫ్లిప్కార్ట్ అందిస్తుంది.
ఈ ప్రీమియం మొబైల్ పై ఆఫర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే కస్టమర్స్ కు భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్కార్ట్. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే కస్టమర్స్ రూ.3000 ఆదనంగా పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ ఈఎమ్ఐ సదుపాయం కూడా కలదు. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్లో కొత్త మొబైల్ ను కొనాలనుకునే యూజర్స్ కు మరింత తక్కువ ధరకే ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇక పాత మొబైల్ అప్ గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.
Google Pixel 8a Features –
Google Pixel 8a స్మార్ట్ ఫోన్ Tensor G3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ లో 6.1 అంగుళాల 24 Bit స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, HDR సపోర్ట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ లో 64MP + 13MP డ్యూయల్ రియర్, 13MP సెల్ఫీ కెమెరా, 4K వీడియో 30 fps/ 60 fps రికార్డ్ సపోర్టింగ్ ఉంది. కెమెరా ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఈ ఫోన్ 4404 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది.