OG Movie: ఓజీ.. ఓజీ.. ఓజీ.. ఇండస్ట్రీ మొత్తం ఇదే మాట మారుమ్రోగిపోతుంది. మరి కొన్ని గంటల్లో ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఒరిజినల్ సినిమా. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక ఓజీ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. అంతేనా.. మిరాయ్ నిర్మాత అయితే గొప్ప నిర్ణయమే తీసుకున్నారు. అదేమిటంటే, రేపు మిరాయ్ ఆడుతున్న అన్ని సినిమా థియేటర్ల స్క్రీన్‌లను ఓజీ సినిమాకి కేటాయించబోతున్నారు. ఇప్పుడు ఓజీ సినిమాకి రిలీజ్ రోజైన గురువారం నాడు థియేటర్లు కేటాయించి, మళ్లీ శుక్రవారం నుంచి మిరాయ్ సినిమా ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నారు.
మిరాయ్ సినిమా ఇప్పటికే రూ. 150 కోట్ల దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా పవన్ కల్యాణ్ మీద గౌరవంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మళ్లీ శుక్రవారం నుంచి యధావిధిగా మిరాయ్ సినిమాను ప్రేక్షకులు తమకు నచ్చిన థియేటర్ లో వీక్షించవచ్చు. సినిమాకి అదనంగా ఆడియన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వైబ్ ఉంది సాంగ్ కూడా నిన్ననే జోడించారు. ఇలాంటి సమయంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం రిస్క్ తోకూడుకున్న పని.
అయినా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్పదే అన్నా కూడా.. అంత గొప్ప పని చేయాలిసిన అవసరం పీపుల్ మీడియాకు ఏముంది అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. కొందరు అయితే పవన్ కళ్యాణ్ భయపెట్టి ఉంటాడని చెప్పుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి.. ఏది చేసినా భయపెట్టినట్లే ఉంటుందని ఇంకొందరు చెప్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ మాత్రం పీపుల్ మీడియాకు.. పవన్ కు అవినాభవ సంబంధం ఉందని, అందుకే ఆయన అలా చేశారని అంటున్నారు. ఏదిఏమైనా ఓజీకి లక్ కలిసి వచ్చినట్లే అని చెప్పొచ్చు. మరి రేపు ఓజీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.