దసరా పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ క్రేజీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ కావడంతో దీనికి ముందుగానే బిగ్ బిలియన్ డేస్ 2025 పేరుతో సెప్టెంబర్ 23 నుంచి సేల్ ప్రారంభించింది. అక్టోబర్ 2 వరకు 10 రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగనుంది. ఈ సేల్ లో మోబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ అప్లయనెన్స్ మీద 90 శాతం వరకు డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ EMIలు అందిస్తుంది. లైట్నింగ్ డీల్స్, ఫ్లాష్ సేల్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, సూపర్‌కాయిన్స్ రివార్డ్స్ లాంటి స్పెషల్ ఫీచర్స్ ను పరిచయం చేసింది.
⦿ మొబైల్స్: మొబైల్స్ మీద 90% వరకు తగ్గింపు అందిస్తోంది. IPhone, Samsung మీద 60% డిస్కౌంట్ ఇస్తుంది. iPhone 16 మీద ఏకంగా రూ. 50,000, Samsung S24 Ultra మీద 60% తగ్గింపు ఇస్తుంది.
⦿ ఎలక్ట్రానిక్స్ & ల్యాప్‌టాప్స్: ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ట్యాప్ టాప్స్ మీద 80% వరకు తగ్గింపు ఇస్తుంది. స్మార్ట్ టీవీల మీద 50%, MacBook Air మీద ₹70,000, 55 ఇంచుల స్మార్ట్ టీవీల మీద రూ.25,000 వరకు తగ్గింపు ఇస్తుంది.
⦿ ఫ్యాషన్ & ఎథ్నిక్ వేర్: వీటి మీద ఏకంగా 85% వరకు తగ్గింపు ఇస్తుంది. దసరా స్పెషల్ ఎథ్నిక్ కలెక్షన్స్ అయిన చీరలు, కుర్తాలు రూ. 500 నుంచి ప్రారంభ అవుతున్నాయి. మెన్స్ షర్ట్స్ మీద ఏకంగా 70% తగ్గింపు అందిస్తోంది.
⦿ హోమ్ అప్లయన్సెస్: హోమ్ అప్లయన్సెస్ మీద 50 నుంచి 70% తగ్గింపు అందిస్తుంది. ఫ్రిజ్/వాషింగ్ మెషిన్ మీద స్పెషల్ ఆఫర్లు ఇస్తుంది. 250L ఫ్రిజ్ మీద రూ. 15,000, ఏసీల మీద 50% వరకు తగ్గింపు ఇస్తుంది.
⦿ కిచెన్ & హోమ్ డెకర్: కిచెన్ వేర్ తో పాటు గృహోపకరణాల మీద 70% వరకు తగ్గింపు ఇస్తుంది. పూజా సామాన్ల మీద ఎక్స్ ట్రా డీల్స్ అందిస్తుంది. మైక్రో వేవ్ మీద రూ. 5,000, హోమ్ డెకర్ మీద 60% ఆఫ్ అందిస్తుంది.
Read Also: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్
⦿ యాక్సిస్, HDFC, ICICI బ్యాంక్ కార్డులు: 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.
⦿ SBI,ICICI నో కాస్ట్ EMI: అన్ని ప్రొడక్ట్స్ మీద నో కాస్ట్ ఈఎంఐ అందిస్తుంది.
⦿ UPI ఆఫర్: రూ. 100 క్యాష్ బ్యాక్ ఇస్తుంది.
⦿ ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ కార్డ్: 5% అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.
⦿ బజాజ్ ఫిన్ సర్వ్ ఇన్‌స్టా EMI కార్డ్: జీరో డౌన్ పేమెంట్, ఈజీ EMI ఆఫర్ చేస్తుంది.
Read Also: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!