BigTV English

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Telangana Group-1 Exam:  తెలంగాణలో గ్రూపు-1 మెయిన్స్ పరీక్షపై  టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది.  గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. ఏజీ ఇచ్చిన సలహాతో గ్రూప్‌-1 నియామకాలు చేపట్టుకోవచ్చని తెలిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై పలు ప్రశ్నలు లేవనెత్తింది ధర్మాసనం.  ఇలాంటి తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది.


తెలంగాణ  గ్రూప్-1 మెయిన్స్ విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యువేషన్ చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యువేషన్ అనేది సర్వీస్ కమిషన్ నిబంధనల బట్టి ఉండాలన్నారు. కానీ TGPSC నిబంధనల ప్రకారం రీకౌంటింగ్ ఉంటుందికానీ..  రీ వాల్యువేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు. 14 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది.


TGPSC కు ఇంటెగ్రిటీ లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌లో ఉందని పేర్కొంది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని, మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటివి ఏమైనా జరిగాయా అని హైకోర్టు ప్రశ్నించింది. సింగిల్ జడ్జి తీర్పు‌లో చాలా డెలికేట్ పదాలు ఉపయోగించారని హైకోర్టు అభిప్రాయపడింది.

ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Bais, integrity అనే పదాలు ఉపయోగించారని, Bais అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా? వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ? ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్-1 పోస్టులు భర్తీ కాలేదా? 2014 నుండి అసలు గ్రూప్-1 రిక్రూట్మెంట్ జరగలేదా? 2014 నుండి TGPSC existenceలో ఉందా? పలు ప్రశ్నలు సంధించింది హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేసింది.

ఈ ఏడాది మార్చి 10న గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఫలితాల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన, కాకపోయిన ఇరు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు సింగిల్ బెంచ్. సెప్టెంబరు 9న తీర్పు ఇచ్చింది.

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేసింది. అదే సమయంలో కమిషన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సింగిల్ బెంచ్. ఈ వ్యవహారంపై క్వాలిఫై అయిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు మీడియా ముందుకొచ్చి తమ గోడు వినిపించారు. హైకోర్టు తీర్పుపై TGPSC అభ్యంతరం వ్యక్తం చేసింది.

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఈ క్రమంలో పలు ప్రశ్నలు లేవనెత్తిన న్యాయస్థానం, విచారణను మళ్లీ మూడు వారాలకు వాయిదా వేసింది.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు వేర్వేరు హాల్‌ టికెట్లు జారీ చేయడాన్ని తప్పుబట్టారని ఏజీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. హాల్‌ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉందని, పరీక్ష కేంద్రాల కేటాయింపును తప్పుబట్టలేమని సీజే వెల్లడించారు. చివరకు సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే విధిస్తూ.. డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చింది. అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్‌ ఏకే సింగ్ తేల్చిచెప్పారు. న్యాయస్థానం స్టే విధించడంతో గ్రూప్‌-1 ర్యాంకర్లకు ఊరట లభించింది.

Related News

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Big Stories

×