China DEMU Trains: చైనా వస్తువుల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఓ పేరుంది. అక్కడి వస్తువులు చాలా చెత్త క్వాలిటీని కలిగి ఉంటాయంటారు. అనడమే కాదు, అదీ నూటికి నూరుపాళ్లు నిజం కూడా. ఇప్పటికీ నమ్మకపోతే, ఈ ఘటన గురించి మీరు తెలుసుకోవాలి. 30 ఏండ్ల పాటు పని చేస్తాయని బంగ్లా సర్కారుకు అమ్మిన 20 DEMU (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైళ్లను కేవలం 10 సంవత్సరాలకే స్క్రాప్ గా మారుతున్నాయి.
2015లో చైనా నుంచి 20 DEMU రైళ్లు దిగుమతి!
2015లో బంగ్లాదేశ్ సర్కారు చైనా నుంచి 20 DEMU రైళ్లను సుమారు రూ. 600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ రైళ్లు సర్వీసులోకి వచ్చిన కొన్ని నెలల్లోనే పలు సమస్యలు తలెత్తాయి. కొత్త టెక్నాలజీ గురించి తెలియని బంగ్లాదేశ్ రైల్వే కార్మికులు మరమ్మతులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. తమకు తెలిసినంత మేరకు మరమ్మతులు చేసినప్పటికీ.. ప్రస్తుతం ఆ రైళ్లన్నీ పని చేయడం మానేశాయి. రైళ్ల మరమ్మతుకు సంబంధించి సరైన టెక్నీషియన్స్ లేకపోవడం, ఆ రైళ్లకు సంబంధించిన విడి భాగాలు స్థానిక మార్కెట్లో అందుబాటులో లేకపోవడం మరమ్మతులు చేయడం ఇబ్బందిగా మారింది. మరమ్మతుల కోసం సరైన వర్క్ షాపులు, నిర్వహణ ఏర్పాట్లు లేకుండానే రైళ్లను కొనుగోలు చేశారు. ఈ రైళ్లను ఆపరేట్ చేయడానికి సరైన శిక్షణ కూడా ఇవ్వలేదని బంగ్లా రైల్వే ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
పాత ఇనుమ సామానుకు అమ్ముతున్నామన్న రైల్వే డైరెక్టర్
అటు బంగ్లాదేశ్ రైల్వే డైరెక్టర్ జనరల్ అఫ్జల్ హొస్సేన్ రైళ్లను మరమ్మతు చేయడంలో విఫలమైనట్లు అంగీకరించారు. వాటిని పాత ఇనుప సామానుకు వేలం వేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. “బంగ్లా రైల్వేలో పని చేయని రైళ్లను పనికిరానిదిగా ప్రకటిస్తాం. ఆ తర్వాత దానిని అమ్మేందుకు ప్రయత్నిస్తాం” అని ఆయన వెల్లడించారు. “ఈ రైళ్లను కొంత మంది నాయకులు వ్యక్తిగత ఆర్థిక లాభంతో చైనా నుంచి కొనుగోలు చేశారు. రైల్వే వ్యవస్థలో ఇలాంటి ప్రాజెక్టులు నిరుపయోగంగా మారడం దారుణం” అన్నారు. అటు భవిష్యత్ తో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమ్యూనికేషన్ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ షంసుల్ హక్ అభిప్రాయపడ్డారు. సరైనా ప్రణాళిక లేకుండా DEMU డీల్ జరిగిందన్నారు. “భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే, కఠినమైన శిక్ష అవసరం అన్నారు. అప్పుడే ఇలాంటి పరిస్థితి మళ్లీ రాదు” అన్నారు.
Read Also: దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఏ స్థానంలో ఉందంటే?
ఇబ్బందుల్లో బంగ్లా రైల్వే సంస్థ
ఈ సంఘటన బంగ్లాదేశ్ రైల్వే వ్యవస్థలో కొనసాగుతున్న సవాళ్లను హైలైట్ చేస్తున్నది. ఒకేసారి 20 రైళ్లు పని చేయకపోవడం చాలా సమస్యలను ఎదురవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, ఆపరేషనల్ కోచ్‌ల కొరత కొత్త రైలు మార్గాల విస్తరణకు ఆటంకం కలిగిస్తుందన్నారు. వీలైనంత త్వరగా రైల్వే సమస్యలను పరిష్కరించి సరైన ట్రాక్ లో పెట్టాలని కోరుతున్నారు.
Read Also:బాబోయ్.. ఒక్క రోజులో ఇండియన్ రైల్వే ఆదాయం అన్నికోట్లా?