BigTV English

Manchu Manoj: మనోజ్ క్యారెక్టర్ ఆ స్టార్ హీరో చేస్తే మిరాయ్ హిట్ అయ్యేదా.. ?

Manchu Manoj: మనోజ్ క్యారెక్టర్ ఆ స్టార్ హీరో చేస్తే మిరాయ్ హిట్ అయ్యేదా.. ?

Manchu Manoj: ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అది ఎన్ని అడ్డంకులు దాటుకొని అయినా వారికే దక్కుతుంది. ఇది చాలాసార్లు రుజువయ్యింది. ఇండస్ట్రీలో ఒక కథను పేపర్ మీద పెట్టినప్పుడు ఎన్నో పేర్లు వస్తాయి. కానీ, ఫైనల్ అయ్యేసరికి ఆ పేర్లు మారి వేరే పేర్లు వస్తాయి. అదే కథ.. సినిమాగా మారినప్పుడు ఇంకొన్ని పేర్లు.. సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు మరికొన్ని.. ఇలా సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యాకా ఎవరైతే ఉన్నారో వారిదే ఆ సినిమా.


ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఉన్న నటీనటుల కోసమే ఆ పాత్రలు ఎదురుచూస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సినిమాలో బాగా హిట్ అయిన క్యారెక్టర్స్ ను చూసి వ్వావ్.. ఈ పాత్ర కోసమే ఇతను పుట్టాడు అని  కామెంట్స్ చేస్తాం. కానీ, అంతకుముందు ఆ పాత్రకు వేరే నటుడిని అనుకోని ఉంటారు. ఇప్పుడు ఈ నటుడిని చూసిన కళ్ళతో ఆ నటుడిని ఊహించుకోలేం. అంతగా ఆ పాత్రలోని నటుడు మనల్ని కట్టిపడేస్తాడు కాబట్టి.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే..  మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మహాబీర్ లామా పాత్రలో అతడి నటనను కొట్టేవారే లేరు. ఆ సినిమాకు అతనే హీరో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతలా ప్రేక్షకులను మెప్పించాడు. ఆ గాంభీర్యం, వాయిస్ బేస్, లుక్.. మనోజ్ లో ఇంత నటన ఉంది అని ఎవరు గుర్తించలేదు. మిరాయ్ తో అది బయటపడింది.


అయితే మహాబీర్ లామాకు మొదట అనుకున్న నటుడు మనోజ్ కాదట. మొదట ఈ పాత్ర కోసం కుర్ర హీరో సందీప్ కిషన్ ను కోరారట డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, తేజ సజ్జా. సందీప్ హీరోగానే కాకుండా విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ కటౌట్ కు విలనిజం కూడా యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే సందీప్ కరెక్ట్ అనుకున్నారట. కథ కూడా బాగా నచ్చడంతో సందీప్ కూడా చేయాలనుకున్నాడు కానీ, వేరే కమిట్ మెంట్స్ ఉండడం వలన చేయలేకపోయాడట.

సందీప్ తరువాత మనోజ్ ను అప్రోచ్ అవ్వడం, ఆయన వెంటనే ఓకే అనడంతో మిరాయ్ పట్టాలెక్కింది. ఒకవేళ సందీప్ ఒప్పుకొని ఉంటే మిరాయ్ హిట్ అయ్యేదా అనేది కొందరి అనుమానం. నిజం చెప్పాలంటే మనోజ్ కన్నా ఎక్కువ కాకపోయినా సందీప్ కూడా మహాబీర్ లామాగా సెట్ అయ్యేవాడు. కాకపోతే.. మనోజ్ రీఎంట్రీ, బయట అతనికి ఉన్న ఫాలోయింగ్.. మోహన్ బాబు కొడుకు అనే పేరు, అతని గాంభీర్యం ఇవన్నీ ఎక్కువ హైప్ ను తీసుకురావడంతో సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. సందీప్ ఉంటే వీటిలో కొద్దిగా తగ్గేవి అనేది కొందరి వాదన. ఏదిఏమైనా పండించే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్లు.. పేరు వచ్చే ప్రతి క్యారెక్టర్ మీద చేసేవాడి పేరు ముందే రాసి ఉంటుందేమో.

Related News

Manchu Manoj: ఓజాస్ గంభీరకు బ్లాక్ స్క్వార్డ్ బెస్ట్ విషెస్..

MSG Movie: అది చిరు రేంజ్.. అప్పుడే ఉత్తరాంధ్ర థియేట్రికల్‌ రైట్స్‌ క్లోజ్, ఎవరు తీసుకున్నారంటే!

Jyothi Poorvaj: ఓర్నీ.. మన జగతీ ఆంటీ కూడా పవన్ ఫ్యానేరా.. ఎంత హాట్ గా ప్రమోట్ చేస్తుందో

OG Bookings : ఛీ ఛీ.. కాసులకు కక్కుర్తి పడి.. బ్లాక్ టికెట్స్ దందాలోకి డిస్ట్రిబ్యూటర్స్ ?

OG Movie: మిరాయ్ థియేటర్లు ఓజీకి.. పవన్ భయపెట్టాడా.. ?

OG Movie: ఉండే గంటకు అంత హైప్ ఎందుకురా బుజ్జి..

Tollywood:కిస్ పెడుతూ… ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్‌లో అడ్డంగా దొరికిపోయిన బేబీ హీరో

Big Stories

×