EPAPER

Oppo Find X Series: కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్లు.. ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్8, ఎక్స్ 8 ప్రో లాంచ్‌కు సిద్ధం.. ఫీచర్లు హైలైట్..!

Oppo Find X Series: కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్లు.. ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్8, ఎక్స్ 8 ప్రో లాంచ్‌కు సిద్ధం.. ఫీచర్లు హైలైట్..!

Oppo Find X8, X8 Pro: చైనీస్ టెక్ బ్రాండ్ Oppo దేశీయ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ అందరి చూపు తనవైపుకు తిప్పుకుంటుంది. ఇప్పటికి చాలా మోడళ్లను లాంచ్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు మరో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒప్పో నుంచి త్వరలో Find X సిరీస్ భారతదేశంలో లాంచ్ కాబోతుంది. ఈ సిరీస్ ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కొన్ని నివేదికల ప్రకారం.. ఒప్పో కంపెనీ Find X8 లైనప్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే ఈ Find X సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు ఉండబోతున్నట్లు సమాచారం. అందులో కంపెనీ Find X8, Find X8 Pro, Find X8 Ultra వంటి మోడళ్లను తీసుకురానుంది. అయితే ఈ మూడు మోడళ్లలో Oppo Find X8 Ultra వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. మిగిలిన రెండు మోడళ్లు Find X8, Find X8 Pro ఈ ఏడాది అక్టోబర్ నాటికి పరిచయం చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుండి Oppo Find X8, X8 Pro గురించి కొంత సమాచారాన్ని వెల్లడించారు.

Also Read: ఆఫర్లే ఆఫర్లు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను ఇంత తక్కువకు కొనేయొచ్చా.. దేవుడా..!


Oppo Find X8, X8 Pro రెండు స్మార్ట్‌ఫోన్లు 1.5K రిజల్యూషన్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్‌లు MediaTek డైమెన్షన్ 9400 ప్రాసెసర్‌తో ప్యాక్ చేయబడతాయని తెలిపారు. ఇది గనుక జరిగితే ఈ ఫోన్ Vivo X200 సిరీస్‌తో పోటీపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ డైమెన్షన్ 9400 ప్రాసెసర్‌ను వివో ఫోన్‌లో కూడా అందించబడింది. దీంతోపాటు Oppo రెండు ఫ్లాగ్‌షిప్‌లలో టెలిఫోటో లెన్స్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

ఫైండ్ X8 ప్రోలో నాలుగు వెనుక కెమెరాలు ఉంటాయని.. వాటిలో రెండు పెరిస్కోప్ లెన్స్‌లుగా ఉంటాయని ఓ టిప్‌స్టర్ గతంలో వెల్లడించారు. కాగా ఈ రెండు ఫోన్లు బ్యాటరీ పరంగా కూడా శక్తివంతమైనవిగా చెప్పుకొచ్చారు. అలాగే Oppo Find పేరుతో నెక్స్ట్ ఇయర్ వచ్చే చాలా ఫోన్‌లు Android 15తో ప్యాక్ చేయబడే అవకాశం ఉందని అన్నారు. అయితే Find X8 సిరీస్‌కి సంబంధించి మాత్రం ఏ OS అనేది ఇంకా వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఒప్పో భారతదేశంలో ఇటీవల Oppo K12xని విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్న ఈ ఫోన్ 8GB RAM, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 32-మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులో ఉంది. Oppo K12x 6GB RAM + 128 GB స్టోరేజ్ ధర రూ.12,999గా ఉంది.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×