Google Pixel 9a: గూగుల్ తన కొత్త స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 9ఏ వచ్చే నెలలో లాంఛ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇటీవల లీకైన స్మార్ట్ ఫోన్ ను బట్టి మార్చ్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయిన గూగుల్ ఫిక్సెల్ 9ఏ ఇంతకు ముందు సీరిస్ మొబైల్ మాదిరిగానే ఉండొచ్చు.
గూగుల్ తన టోన్డ్-డౌన్ వెర్షన్, గూగుల్ పిక్సెల్ 9ఏను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోన్న వేళ ఇప్పుడు దాని ధర గురించి మాట్లాడుకుంటున్నారు. ఫిక్సెల్ 9ఏ మునపటి మొబైల్ ధరతో సమానంగా ఉండొచ్చనే పుకార్లు వినబడుతున్నాయి. ఆండ్రాయిడ్ హెడ్ లైన్స్ రిపోర్టు ప్రకారం.. యూఎస్, యూరోపియన్ ధరలు 2024 మే నెలలో లాంచ్ చేసిన ఫిక్సెల్ 8ఏ వలే ఉండొచ్చని తెలిపింది. యూరప్ లో గూగుల్ ఫిక్సెల్ 9ఏ 128 జీబీ స్టోరోజ్ వేరియంట్ ధర సుమారు ధర 549 యూరోలు(రూ.50,200), 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 609 యూరోలు(రూ.55,700) ఉండొచ్చని పేర్కొంది. యుఎస్‌లో ఈ ఫోన్ ధర $499 (రూ. 43,400)గా ఉంటుందని వారు గతంలో చెప్పినట్లు పేర్కొన్నారు.
ALSO READ: Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం
ఆండ్రాయిడ్ హెడ్ లైన్ రిపోర్ట్ ప్రకారం.. యూఎస్ లో గూగుల్ ఫిక్సెల్ 9ఏ 128 జీబీ వేరియంట్ ధర 679 డాలర్లు (రూ.59,100), ఫిక్సెల్ 9ఏ 256 జీబీ వేరియంట్ ధర 809 డాలర్లు(రూ.70,500) గా అంచనా వేశారు. స్మార్ట్ మొబైల్ లకు ధరలు పెరుగుతున్న క్రమంలో గూగుల్ ఫిక్సెల్ 9ఏ సరికొత్త డిజైన్ తో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకురావడమే గాక పాత ధరలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గూగుల్ ఫిక్సెల్ 9ఏ ధరలు ఇండియాలో ఇంకా రిలీజ్ కానప్పటికీ, ఇవి ఫిక్సెల్ 8ఏ ధరలను పోలి ఉండనున్నట్లు సమాచారం. మన దేశంలో గూగుల్ ఫిక్సెల్ 8ఏ 128 జీబీ వేరియంట్ ధర రూ.52,999, 256 జీబీ వేరియంట్ ధర రూ..59,999గా మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ హెడ్ లైన్ గత నివేదకల ప్రకారం.. యూఎస్ లో గూగుల్ ఫిక్సెల్ 9ఏ 128 జీబీ వేరియంట్ ధర 499 డాలర్లు (రూ.43,400), 256 జీబీ వేరియంట్ ధర 599 డాలర్లు (రూ.51,800) అంచనా వేసింది. ఫిక్సెల్ 9ఏ ఎక్కువ స్టోరేజీ ఉండడంతో 40డాలర్లు(రూ.3400) పెరుగుదల ఉండొచ్చు.
ALSO READ: CISF Recruitment: గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం..
గూగుల్ ఇదే ధర వ్యూహాన్ని ఫాల్లో అయితే ఫిక్సెల్ 9ఏ ధర రూ.52,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. 256 జీబీ వేరియంట్ ధర అయితే రూ.64,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. 128 జీబీ, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ల మధ్య ధర రూ.10వేల కంటె ఎక్కువగా ఉండొచ్చు.
తాజాగా సోషల్ మీడియాలో లీకైన వీడియోలు గూగుల్ ఫిక్సెల్ 9ఏ డిజైన్ ఫోటోలు వైరలవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఫిక్సెల్ 8ఏ మోడల్ లో కనిపించే సిగ్నేచర్ బార్-స్టైల్ కెమెరా మాడ్యూల్‌ను స్లీకర్, ఫ్లష్-బ్యాక్ డిజైన్ ను పోలి ఉండొచ్చని నివేదకలు సూచిస్తున్నాయి. సంబంధించిన వీడియోలో మొబైల్ బ్యాక్ సైడ్ ఫోటోలు లీక్ చేశారు. కెమెరా మాడ్యుల్ బయటకు రాకుండా ఫోన్ తోనే కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ రైట్ సైడ్ లో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ లు ఉన్నాయి. మొబైల్ లెఫ్ట్ సైడ్ లో ఎలాంటి బటన్స్ లేవు.
ALSO READ: NAFED Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. నెలకు రూ.1,50,000 జీతం.. ఇంకా మూడు రోజులే..!
ఫిక్సెల్ 9ఏ ఫ్రెంట్ సైడ్ మాత్రం వీడియోలో లీక్ కాలేదు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్టు, 2,700 nits తో ప్రకాశవంతంగా 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని రిపోర్టులు సూచిస్తున్నాయి. అయితే, ప్రీమియం పిక్సెల్ 9 మోడల్‌లతో పోలిస్తే ఈ మోడల్ కొంచెం మందంగా ఉండవచ్చని తెలుస్తోంది.
గూగుల్ ఫిక్సెల్ 9ఏ పనితీరు 8జీబీ LPDDR5X RAMతో గూగుల్ టెన్సార్ G4 చిప్‌సెట్‌లో రన్ అవుతుందని భావిస్తున్నారు. స్టోరేజ్ ఆప్షన్‌లలో 128GB, 256GB ఉంటాయి. ఈ రెండు డివైస్ లు UFS 3.1 టెక్నాలజీ ఆధారంగా పని చేస్తాయి. కెమెరాల విషయానికొస్తే, Pixel 9a 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్-లెన్స్ సెటప్‌ను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 13-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా కలిగి ఉండొచ్చని నివేదకలు చెబుతున్నాయి.