Telugu Producer : ఒక్కక్కరిది ఒక్కో వ్యాపారం. ఏం చేసినా… నాలుగు రాళ్లు వెనకవేయడమే… లక్ష్యం. వ్యాపారం అంటే… లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తాయి. అలా ఓ NRI… చాలా డబ్బులు ఉన్న NRI సినిమా ఇండస్ట్రీలో వ్యాపారం చేస్తున్నాడు. సినిమాలంటే… చాలా ఇష్టంతో నిర్మాతగా మారి… చాలా సినిమాలు చేశాడు. చేస్తున్నాడు. ఇంతకు ముందు చెప్పినట్టు ఇది కూడా ఓ వ్యాపారం కదా… అందుకే ఈ NRI నిర్మాతకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయి.
ఆ చాలా డబ్బులున్న NRI నిర్మాత చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. దీంతో ఆయనకు లాస్ వస్తుంది. ఈయనకు లాస్ వచ్చినా… సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో అదే సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. అందుకే మొన్నటి వరకు ఈయనపై కాస్త సింపతి కూడా ఉండేది. సింపతి మొన్నటి వరకేనా…? ఇప్పుడు లేదా…. అంటే.? అవును… ఆ NRI నిర్మాతపై ఉన్న సింపతి రోజు రోజుకు ఆవిరైపోతుంది.
ఎందుకంటే… ఆయన కొన్ని స్టోరీలను నమ్ముతున్నాడు. ఆ స్టోరీలు బాక్సాఫీస్ వద్ద నత్త కంటే స్లోగా రన్ అవుతాయి. ఇది ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇంకా అవుతూనే ఉన్నాయి. దీనికి సింపతి పోదు. మరి ఎందుకు ఈయనగారిపై నెగిటివిటీ వస్తుంది అంటే… ఆయన నమ్మిన స్టోరీని మరి కొంత నిర్మాతలతో కలిసి చేస్తున్నాడు.
కలిసి చేస్తే ఏం అవుతుంది. ఆయన నమ్మిన స్టోరీ కదా… నత్తనే అవుతుంది కానీ, కుందేలు అవ్వదు కదా. అలా… సినిమాలు ప్లాప్, డిజాస్టర్లు అవుతున్నాయి. దీంతో ఈ చాలా డబ్బులున్న NRI ప్రొడ్యూసర్‌తో పాటు ఆ నిర్మాతలకు లాస్ వస్తుంది. ఈయనకంటే అలవాటు అయిపోయింది. కానీ, వాళ్లు తలకు చేతులు పట్టుకుని ఎందుకు ఇలాంటి మూవీ చేశామా..? అని ఆలోచించుకుంటున్నారట.
నిర్మాతల సంగతి ఇలా ఉంటే… ఇక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల బాధ అయితే చెప్పలేం. ఈ NRI ప్రొడ్యూసర్‌ను నమ్ముకుని కోట్ల రూపాయలు పెట్టి మూవీ రైట్స్ తీసుకుంటే… అవి కాస్త డిజాస్టర్లు. ఈయన అంటే డబ్బు ఉన్న NRI ప్రొడ్యూసర్. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల పరిస్థితి వేరు కదా… ఒక సినిమా హిట్ అయితేనే… పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తేనే… మరో మూవీ చేయగలరు. లేకపోతే కెరీరే పక్కన పడిపోయే ప్రమాదం ఉంటుంది.
ఓ సైడ్ ఇదింతా… జరుగుతూనే ఉంటుంది. కానీ, అన్నీ అబ్జర్వూ చేసే వాళ్లు కూడా ఉంటారు కదా… వాళ్లు… ఆ చాలా డబ్బులున్న NRI నిర్మాతతో జాగ్రత్తగా ఉండాలని, ఆయనతో సినిమాలంటే… సైలెంట్‌గా సైడ్ అయిపోవాలని సూచిస్తున్నారట. ఒక వేళ సినిమా చేయాల్సిన పరిస్థితే వస్తే… ఆయన నమ్మే స్టోరీ కాకుండా ఉంటే బెటర్ అని సలహాలు ఇస్తున్నారట.