NAFED Recruitment: నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(నాఫెడ్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్), మాస్టర్స్(బీఏ)లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు.
ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NAFED) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 28 న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: CISF Recruitment: గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం..
ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పది ఉద్యోగాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10
షనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఇందులో డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్), అసిస్టెంట్ మేనేజర్ (లీగల్), అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగాలు వెకెన్సీ వారీగా.. చూసినట్లయితే..
డిప్యూటీ మేనేజర్: 4 ఉద్యోగాలు
డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్): 4 ఉద్యోగాలు
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 1 వెకెన్సీ
అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 1 వెకెన్సీ ఉంది.
దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు ఫిబ్రవరి 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉంది.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్), మాస్టర్స్(బీఏ)లో పాసై ఉంటే ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణ లోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని వయస్సును నిర్ధారించారు. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి 40 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి 35 ఏళ్ల వయస్సు ఉండాలి.
వేతనం: ఉద్యోగానిిక ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అయితే నెలకు రూ.47,600 నుంచి రూ.1,51,100 ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి అయితే నెలకు రూ.53,100 నుంచి రూ.1,67,800 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్ర్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో అయిపోయాక ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు. అందులో ఉన్నవారిని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nafed-india.com/current-openings
ALSO READ: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.65,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28