E-Paper
Advertisement

Sanchar Saathi App: వెనకడుగు వేసిన కేంద్రం.. ఫోన్‌లో ఆ యాప్ తప్పనిసరి కాదు..

Sanchar Saathi App: వెనకడుగు వేసిన కేంద్రం.. ఫోన్‌లో ఆ యాప్ తప్పనిసరి కాదు..
Advertisement

Sanchar Saathi App Controversy| దేశంలోని అన్ని కొత్త మొబైల్ ఫోన్‌లలో ‘సంచార్ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భారీ వివాదానికి తెరలేపింది. అయితే ఈ ప్రభుత్వం యాప్ ప్రజల ప్రైవెసీని దెబ్బతీస్తుందని, నిఘాను పెంచుతుందని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టత ఇచ్చారు.

యూజర్ ఇష్టం – యాప్ తొలగించొచ్చు

మంగళవారం కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయంపై పార్లమెంటులో ప్రకటన చేశారు. “స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సంచార్ సాతీ యాప్ ఆప్షనల్. యాప్ కావాల్సిన వారు వినియోగించుకోవచ్చు.. వద్దంటే డెలీట్ చేయవచ్చు. ప్రతి ఒక్కరికీ ఈ యాప్ గురించి తెలియజేయడం మా బాధ్యత. దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వినియోగదారుడి నిర్ణయం” అని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ యాప్‌ను అందరి ఫోన్‌లో ఉండాలని చెబుతోంది?

Advertisement

టెలికాం శాఖ (DoT) ప్రకారం.. సంచార్ సాథీ యాప్ ప్రధానంగా మూడు లక్ష్యాల కోసం తీసుకొచ్చారు:

  • నకిలీ మొబైల్స్ బారి నుంచి ప్రజలను కాపాడడం కోసం.
  • సైబర్ మోసాలు, నేరాల గురించి ప్రజలు ఫిర్యాదు చేయడానికి సౌలభ్యం కోసం.
  • ఇప్పటికే ఉన్న ‘సంచార్ సాథీ’ పోర్టల్‌ను మరింత ప్రభావవంతం చేయడానికి

అందుకే కొత్తగా తయారయ్యే లేదా దేశంలో దిగుమతి అయ్యే అన్ని మొబైల్స్‌లో ఈ యాప్ ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని, ఫోన్ మొదటిసారి ఆన్ చేసినప్పుడు స్పష్టంగా కనిపించేలా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా పంపాలని చెప్పారు. ఈ ఆదేశాలను 90 రోజుల్లో అమలు చేయాలని, 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత

Advertisement

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. యాప్ తప్పనిసరి అనే ఆదేశాన్ని “నిఘా యాప్” అని మండిపడ్డారు. “ప్రజలకు గోప్యత హక్కు ఉంది. కుటుంబం, స్నేహితులకు మెసేజ్‌లు పంపినా ప్రభుత్వం చూడడం ఏమిటి? ఇది దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టే ప్రయత్నం” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సూర్జేవాలా “ఇప్పుడు భారత్ ‘నిఘా రాష్ట్రం’ అయిపోయింది” అని విమర్శించారు. ఈ యాప్‌ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

సంచార్ సాథీ యాప్‌ని తిరస్కరించిన ఆపిల్

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ ప్రీఇన్‌స్టాల్ చేయాలని అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సూచించింది. అయితే ఐఫోన్స్ తయారు చేసే టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ కేంద్ర ఆదేశాలను తిరస్కరించింది. ఐఫోన్‌లలో ఈ యాప్ పెట్టడం వల్ల iOS ప్రైవెసీ, భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని ఆపిల్ అభిప్రాయపడింది. ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలియజేస్తామని, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేయడమో లేదా బహిరంగంగా వ్యతిరేకించడం లాంటి చర్యలు ప్రస్తుతానికి అవసరం లేదని ఆపిల్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు శామ్‌సంగ్, ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×