RCB -CSK : సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏ క్రికెటర్ ఎప్పుడూ ఎలా వ్యవహరిస్తారో ఊహించడం చాలా కష్టం. ప్రధానంగా క్రికెట్ ఆడేటప్పుడు ఆ క్రికెటర్ తలకు బ్యాండేజీ.. ఇంకొందరూ దస్తీ, మరికొందరూ హెల్మెంట్ వంటి ధరించడం మనం చూస్తుంటాం. ఇలా రకరకాలుగా ఆటగాళ్లు తమకు అనుకూలంగా తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు. కొంత మంది క్రికెటర్లు కేవలం ఒకే ఒక్క టీమ్ తరపున ఆడుతుంటారు. మరికొందరూ క్రికెటర్లు టీమ్ లు మారుతుంటారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయి.
Also Read : Glenn Maxwell-IPL 2026 : అఫీషీయల్.. ఐపీఎల్ కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్..మొత్తం 4 గురు రాక్షసులు ఔట్
ప్రస్తుతం తమ అభిమాన క్రికెటర్ ఆ టీమ్ లోనే ఉన్నాడు. తాను ఆ టీమ్ కే అభిమాని అని చెప్పుకుంటారు. ముఖ్యంగా టీమిండియాకి కొద్ది రోజులు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఆ తరువాత గుజరాత్ కి కెప్టెన్ వ్యవహరించి ఓ టైటిల్ ని కూడా అందించారు. మళ్లీ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడారు. అయితే హార్దిక్ పాండ్యా అభిమానులు మాత్రం హార్దిక్ పాండ్యా ఏ జట్టు తరపున ఆడితే ఆ జట్టుకే మద్దతు ఇచ్చేవారు. అలాగే ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రం కేవలం ఒకే ఒక్క జట్టు తరపున ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడితే.. ఎం.ఎస్. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నారు. ఇక మిగతా ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఒకే జట్టు తరపున ఆడేవారు ఉన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆటగాళ్లు అందరూ ఏ జట్టుకు ఆడినా వాళ్లు చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. కానీ అభిమానులు మాత్రం కొట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో చంపుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాళ్లు అందరూ అలా మంచిగా కలిసి మెలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ల కోసం అంతలా కొట్టుకుంటున్నాం. ఇలా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నామని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ధోనీ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వీళ్లు ఎవరైనా అందరూ కలిసి ఉంటారు. అపోజిట్ గా ఐపీఎల్ కి ఆడినప్పుడు మాత్రమే ఆటను ఆడుతారు. ఆ తరువాత కలిసి అందరూ టీమిండియా తరపున ఆడుతుంటారు. క్రికెటర్లు ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వాళ్లంతా మంచిగానే ఉంటారు. కానీ వాళ్లను మనం ట్రోల్స్ చేసుడెందుకు అని ప్రశ్నించే వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్లర వేశాలు వేసేవాడిని కాదు