LG vs Haier Top Load Washing Machine: ఇంట్లోకి కొత్తగా టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్కెట్లో బెస్ట్ బ్రాండ్స్ అయిన హైయర్ (Haier), ఎల్‌జి (LG) లలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లతో హైయర్ అదరగొడుతుంటే.. నమ్మకమైన క్వాలిటీ, స్మార్ట్ టెక్నాలజీతో ఎల్‌జి గట్టి పోటీ ఇస్తోంది. ఈ రెండింటిలో మీ ఇంటికి ఏది పర్ఫెక్ట్, దేని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ధరల గురించి పూర్తి విషయాలు ఇప్పడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ముఖ్యంగా వాడకానికి ఈజీగా ఉండే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను మనవాళ్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే.. బ్రాండ్స్ విషయానికి వస్తే అందరి మైండ్‌లో మెదిలే మొదటి రెండు పేర్లు.. హైయర్ , ఎల్‌జి. ఈ రెండూ టాప్ క్లాస్ బ్రాండ్స్ అయినప్పటికీ, వీటి ఫీచర్లు, టెక్నాలజీ , బడ్జెట్‌లో కొన్ని కీలకమైన తేడాలున్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్ గా కంపేర్ చేసి చూద్దాం.
ఎల్‌జి (LG): ఎల్‌జి టాప్ లోడ్ మెషీన్లలో ‘స్మార్ట్ ఇన్వర్టర్’, ‘టర్బోడ్రమ్’టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది బట్టలపై ఉన్న మొండి మరకలను చాలా ఈజీగా వదిలిస్తుంది. డ్రమ్, పల్సేటర్ రెండు వైపులా తిరగడం వల్ల బట్టలు ఒకదానికొకటి ముడిపడిపోకుండా క్లీన్ అవుతాయి.
హైయర్ (Haier): హైయర్ మెషీన్లలో ‘ఓషన్ వేవ్ డ్రమ్’, ‘క్యూబ్ టెక్నాలజీ’ఉంటాయి. ఇవి బట్టలను చాలా సున్నితంగా, అదే సమయంలో క్లీన్‌గా ఉతుకుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బిగ్ పల్సేటర్ వల్ల నీటి ప్రవాహం బలంగా ఉండి బట్టలు త్వరగా క్లీన్ అవుతాయి.
ఎల్‌జి: ఎల్‌జి తన స్మార్ట్ ఇన్వర్టర్ మోటార్‌పై ఏకంగా 10 ఏళ్ల వారంటీ ఇస్తుంది. ఈ మోటార్లపై వాటర్‌ప్రూఫ్ కోటింగ్ ఉండటం వల్ల తుప్పు పట్టవు, ఎక్కువ కాలం పాడవకుండ ఉంటుంది.
హైయర్: హైయర్ లో కొన్ని ప్రీమియం మోడల్స్ ‘డైరెక్ట్ మోషన్ మోటార్’తో వస్తాయి. ఇవి బెల్ట్ లేకుండా నేరుగా డ్రమ్‌కే కనెక్ట్ అయి ఉండటం వల్ల సౌండ్, వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కూడా కంపెనీ 10 ఏళ్ల వారంటీ ఇస్తుంది.
ఎల్‌జి: టెక్నాలజీ పరంగా ఎల్‌జి ఒక అడుగు ముందే ఉంటుంది. ‘ThinQ’ యాప్ ద్వారా వైఫై తో కనెక్ట్ చేసి ఫోన్ నుండే మెషీన్‌ను ఆపరేట్ చేయవచ్చు. అలాగే ‘స్మార్ట్ డయాగ్నోసిస్’ ఫీచర్ ద్వారా మెషీన్‌లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ లోనే తెలిసిపోతుంది.
హైయర్: హైయర్ లో ‘నియర్ జీరో ప్రెజర్’టెక్నాలజీ ఒక పెద్ద ప్లస్ పాయింట్. మీ ఇంట్లో వాటర్ ప్రెజర్ చాలా తక్కువగా ఉన్నా సరే, ఈ మెషీన్ సూపర్‌గా పనిచేస్తుంది. అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి ఇది బెస్ట్ ఫీచర్.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, మంచి లుక్ కావాలనుకుంటే.. హైయర్ బెస్ట్ చాయిస్. ఎల్‌జితో పోలిస్తే హైయర్ ధరలు కాస్త అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం ఎక్కువున్నా పర్లేదు, బ్రాండ్ వాల్యూ, ది బెస్ట్ కస్టమర్ సర్వీస్, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు కావాలనుకుంటే.. మాత్రం కళ్ళు మూసుకుని ఎల్‌జి వైపు వెళ్ళిపోవచ్చు.
మీరు వాటర్ ప్రెజర్ తక్కువగా ఉండే ఏరియాలో ఉంటూ.. బడ్జెట్ ఫ్రెండ్లీగా బెస్ట్ లుకింగ్ మెషీన్ కావాలంటే హైయర్ టాప్ లోడ్ తీసుకోండి. అలా కాకుండా.. లాంగ్ లైఫ్, బ్రాండ్ నమ్మకం, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, బట్టలు ముడిపడకుండా క్లీన్ అవ్వడం ముఖ్యం అనుకుంటే ఎల్‌జి టాప్ లోడ్ మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.