E-Paper
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Royal Enfield Continental GT 750:  ప్రముఖ టూ వీలర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది. EICMA 2026 వేదికగా కాంటినెంటల్ GT 750ని పరిచయం చేసింది. ఇప్పటికే హిమాలయన్ 750తో పరిచయం చేసిన కొత్త 743cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను ఈ బైక్‌లోనూ ఉపయోగించింది. ఇంజిన్ ఒకటే అయినప్పటికీ, డిజైన్, ఫీచర్లు, రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ లో కీలక మార్పులు చేసింది.

743cc ఇంజిన్.. డ్యూయల్ ఎగ్జాస్ట్..

కాంటినెంటల్ GT 750లో 743cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. హిమాలయన్ 750లో ఈ ఇంజిన్ 55hp పవర్, 63Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాంటినెంటల్ GT 750లోనూ దాదాపు ఇదే పనితీరు ఉండే అవకాశం ఉంది. అయితే, హిమాలయన్‌లో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ ఉండగా, ఈ బైక్‌లో కేబుల్ ఆపరేటెడ్ థ్రాటిల్ ఇచ్చారు. సింగిల్ ఎగ్జాస్ట్‌ కు బదులుగా ట్విన్ ఎగ్జాస్ట్ పైపులను ఏర్పాటు చేశారు.

బ్రేకింగ్, సస్పెన్షన్‌లో మార్పులు

Advertisement

ఈ కొత్త బైక్‌లో ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సస్పెన్షన్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లను అందించారు. వీటిని ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం కల్పించారు.  650cc కాంటినెంటల్ GTతో పోలిస్తే సస్పెన్షన్ సెటప్‌ లో కొన్ని మార్పులతో వచ్చింది. డిజైన్ పరంగా రెట్రో లుక్‌ను కొనసాగిస్తూనే లేటెస్ట్ ఫీచర్లను యాడ్ చేశారు. రెండు అనలాగ్ మీటర్ల మధ్య చిన్న TFT డిస్‌ ప్లే ఉంటుంది. మెటల్ స్విచ్ క్యూబ్స్ కూడా ప్రత్యకంగా ఆకట్టుకుంటుంది.

మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి..

కాంటినెంటల్ GT 750ను మాస్టర్ క్లీన్, రెడ్ లైన్, TT బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. తొలి రెండు వేరియంట్లలో క్రోమ్ ఫినిష్, వైర్ స్పోక్ వీల్స్ ఉంటాయి. TT బ్లూ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు అందించారు. మూడు వేరియంట్లలోనూ 18 అంగుళాల వీల్స్, సింగిల్ పీస్ సీట్ ఉంటాయి.

ఫ్లయింగ్ ఫ్లీ S6 కూడా లాంచ్

Advertisement

అటు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రెండో ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ S6 ప్రొడక్షన్ వెర్షన్‌ను కూడా పరిచయం చేసింది. స్క్రాంబ్లర్ డిజైన్‌తో వచ్చిన ఈ బైక్‌లో 19/18 అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, లాంగ్ ట్రావెల్ USD ఫ్రంట్ ఫోర్క్, మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. C6 మోడల్‌లో ఉన్న పవర్‌ట్రెయిన్‌నే ఇందులోనూ ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, ట్యూనింగ్‌ లో మార్పులు ఉండనున్నాయి. ఎల్లో, గ్రే, కార్బన్ కలర్స్ లో ఫ్లయింగ్ ఫ్లీ S6 అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కాంటినెంటల్ GT 750 భారత మార్కెట్లో వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో  విడుదల కావచ్చని తెలుస్తోంది.

Read Also: పెట్రోల్ కాదు, ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో వెస్పా.. రెండు కొత్త మోడళ్లు లాంచ్!

Tags

Related News

పెట్రోల్ కాదు, ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో వెస్పా.. రెండు కొత్త మోడళ్లు లాంచ్!

టాటా చరిత్రలో తొలిసారి.. జస్ట్ 10 నెలల్లోనే 6 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు!

ఒకటి కాదు రెండు కాదు.. యమహా నుంచి ఒకేసారి 5 కొత్త స్కూటర్లు లాంచ్!

నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

రూ.30 లక్షల లోపు 7 సీటర్ SUVలపై భారీ డిస్కౌంట్లు.. ఏ కారుపై ఎంత ఆఫర్ ఉందంటే?

మారుతి డిజైర్‌కు అదిరిపోయే క్రేజ్.. 35 లక్షల యూనిట్ల తయారీ పూర్తి!

డిసెంబర్ 2న హోండా సంచలనం.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×