New HP laptops OLED display: రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ.. ప్రపంచంలో ల్యాప్‌టాప్‌ల అవసరం విపరీతంగా పెరిగిపోయింది. స్టూడెంట్స్ నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు తగ్గట్టుగా తేలికైన,పవర్ ఫుల్ డివైజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. యూజర్ల ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెక్ బ్రాండ్ హెచ్‌పి ఇండియాలో రెండు అద్భుతమైన ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. అవే హెచ్‌పి ఓమ్నిబుక్ 5 , హెచ్‌పి ప్రోబుక్ 4 G2iS. యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్‌పి విడుదల చేసిన .. ఈ రెండు మోడళ్లలో ఓమ్నిబుక్ 5 ప్రధానంగా విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసారు. ఇది బెస్ట్ డిజైన్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇక రెండో మోడల్ అయిన ప్రోబుక్ 4 G2iS చిన్న వ్యాపార యజమానులు,ప్రొఫేషనల్స్, కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసారు. ఇందులో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు అందించడం విశేషం.
ఇండియన్ మార్కెట్లో వీటి ధరల విషయానికి వస్తే..హెచ్‌పి ఓమ్నిబుక్ 5 14 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,09,999గా ఉంది. అయితే.. నవంబర్ 10 వరకు అందుబాటులో ఉండే ప్రీ-బుకింగ్ ఆఫర్ల ద్వారా కస్టమర్లు దీనిని కేవలం రూ.79,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. హెచ్‌పి ఆన్‌లైన్ స్టోర్ లేదా అధికారిక రీసెల్లర్ల ద్వారా వీటిని కొనొచ్చు.
మరోవైపు.. హెచ్‌పి ప్రోబుక్ 4 G2iS 14 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.86,000 (పన్నులు మినహాయించి)గా నిర్ణయించారు. మిస్ట్ సిల్వర్ మోడల్ నవంబర్ 6 నుంచి అందుబాటులోకి రానుండగా, అట్మాస్ఫియరిక్ బ్లూ లేదా ఎక్లిప్స్ గ్రే కలర్ వేరియంట్లు కోరుకునేవారు డిసెంబర్ చివరి వరకు ఆగాల్సి ఉంటుంది.
ఈ రెండు ల్యాప్‌టాప్‌లు కూడా బెస్ట్ విజువల్ అందించే ఓఎల్ఈడీ డిస్‌ప్లేలతో వస్తాయి. ఓమ్నిబుక్ 5 లో 100 శాతం DCI-P3 కలర్ కవరేజ్ , హెచ్‌పి ఐ ఈజ్ టెక్నాలజీతో కూడిన 14-ఇంచుల డిస్‌ప్లే ఉంది. ప్రోబుక్ మోడల్ మరింత మెరుగైన 14-ఇంచుల 2.8K హై-రిజల్యూషన్ ప్యానెల్‌ను కలిగి ఉంది.
ప్రాసెసింగ్ పరంగా రెండు ల్యాప్‌టాప్‌లు పవర్ ఫుల్ ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్‌ల వరకు సపోర్ట్ చేస్తాయి. అయితే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనుల కోసం వీటిలో ఉండే ఎల్పీయూలలో స్వల్ప తేడాలు ఉన్నాయి. ప్రోబుక్ 4 G2iS లో 17 TOPS రేటింగ్ ఉండగా.. ఓమ్నిబుక్ 5 లో 16 TOPS రేటింగ్ లభిస్తుంది. ప్రోబుక్ గరిష్టంగా 32GB RAM, 1TB స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుండగా, ఓమ్నిబుక్ 16GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.
Also Read: రూ.1,599కే..20000 mAh భారీ బ్యాటరీతో ఫిలిప్స్ పవర్ బ్యాంక్!
ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలలో బ్యాటరీ లైఫ్ ముఖ్యమైంది. HP ఓమ్నిబుక్ 5 ఏకంగా 42 గంటల వరకు లోకల్ వీడియో ప్లేబ్యాక్‌ను.. అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా.. దీంతో పాటు 65W USB మినీ GaN ఛార్జర్ వస్తుంది. ఇక ప్రోబుక్ విషయానికి వస్తే.. ఇందులో HP ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 70Wh బ్యాటరీని ఉపయోగించారు.
బరువు, డిజైన్ పరంగా ఇవి చాలా స్లిమ్‌గా ఉన్నాయి. ఓమ్నిబుక్ 5 కేవలం 1.16 కిలోల బరువు,11.77 మి.మీ.మందంతో ఉంటుంది. ఇందులో.. 180-డిగ్రీల హింజ్ సపోర్ట్ లభిస్తుంది. ప్రోబుక్ 1.18 కిలోల బరువుతో ఉంటుంది. సెక్యూరిటీ పరంగా.. ప్రోబుక్‌లో ఫిజికల్ కెమెరా ప్రైవసీ షట్టర్, హెచ్‌పి డ్రైవ్ లాక్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. రెండు ల్యాప్ టాప్‌లు కూడా విండోస్ హలో.. ఫేషియల్ రికగ్నిషన్‌కు సపోర్ట్ చేస్తాయి.మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకుంటే హెచ్‌పి కొత్త ల్యాప్‌టాప్‌లు పక్కాగా సరి పోతాయి.