E-Paper
Advertisement

గీజర్ కొంటున్నారా?ఈ7 విషయాలు తెలుసుకోకపోతే డబ్బు వృథా!

గీజర్ కొంటున్నారా?ఈ7 విషయాలు తెలుసుకోకపోతే డబ్బు వృథా!
Advertisement

How to buy a water heater: ఈ రోజుల్లో మార్కెట్లో చాలా రకాల గీజర్లు అందుబాటులో ఉండటంతో.. సరైన మోడల్, ఫీచర్లను ఎంచుకోవడం చాలా గందరగోళంగా మారుతుంది. మీరు కూడా మీ ఇంటి కోసం కొత్త గీజర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కేవలం ధర , బ్రాండ్‌ను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవడం సరికాదు. మంచి గీజర్ కొనడానికి, దాని ట్యాంక్ క్వాలిటీ, హీటింగ్ ఎలిమెంట్, కరెంట్ ఖర్చు, సేఫ్టీ ఫీచర్లపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఇది కాకుండా.. ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య,నీటి పీడనం కూడా సరైన మోడల్‌ను ఎంచుకోవడంలో సహాయ పడతాయి. కొత్త గీజర్ కొనే ముందు ఏ 7 ఫీచర్లను చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ట్యాంక్ మెటీరియల్,తుప్పు:

గీజర్లతో అతిపెద్ద సమస్య తుప్పు పట్టడం. ఎప్పుడూ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ , తుప్పు నిరోధక పూత ఉన్న గీజర్‌ను కొనండి. మీ ప్రాంతంలో ఉప్పునీరు ఉంటే.. గాజు పూత లేదా ఎనామెల్ పూత ఉన్న ట్యాంకులు గల గీజర్లు బెస్ట్ అని చెప్పొచ్చు.ఇది గీజర్ త్వరగా పాడవకుండా కాపాడుతుంది.

2. హీటింగ్ ఎలిమెంట్ క్వాలిటీ:

Advertisement

గీజర్ ప్రధాన ఉద్దేశం నీటిని వేడి చేయడం, ఇది హీటింగ్ ఎలిమెంట్ ద్వారా జరుగుతుంది. అందుకే మీ గీజర్‌లో.. రాగి లేదా ఇంకోలాయ్ హీటింగ్ ఎలిమెంట్ ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా ఇంకోలాయ్ ఎలిమెంట్లు..ఉప్పు నీటిలో కూడా తుప్పు పట్టవు , ఇవి చాలా కాలం పాటు అద్భుతమైన వేడిని అందిస్తాయి.

3. BEE రేటింగ్:

చలికాలంలో ఎక్కువకరెంట్ బిల్లుకు గీజర్‌లే ప్రధాన కారణం. అందుకే.. కొత్త గీజర్‌ను కొనేటప్పుడు, దాని BEE స్టార్ రేటింగ్‌ను తప్పకుండా చెక్ చేయండి. 4 లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న గీజర్ మొదట్లో.. కొంచెం ఖరీదైనదిగా అనిపించినప్పటికీ.. అది మీ కరెంట్ బిల్లులపై గణనీయంగా డబ్బును ఆదా చేస్తుంది.

4.సేఫ్టీ అంశాలు:

Advertisement

నీరు,కరెంట్ ఎల్లప్పుడూ ప్రమాదకరం. కాబట్టి సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక గీజర్‌కు అధిక వేడి నుంచి రక్షణ, అధిక పీడనాన్ని.. తట్టుకునే సామర్థ్యం , కరెంట్ లోపాల నుంచి రక్షణ ఉండాలి. థర్మల్ కట్-అవుట్‌లు, ఎర్త్-లీకేజ్ రక్షణ వంటి ఫీచర్లు మీ కుటుంబ సభ్యుల సేఫ్టీని నిర్ధారిస్తాయి.

5. ఎత్తైన భవనాలు:

మీరు ఎత్తైన ఇళ్లలో నివసిస్తుంటే.. నీటి పీడనం చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో అధిక పీడనాన్ని తట్టుకోగల మోడల్‌ను ఎప్పుడూ ఎంచుకోండి. ప్రెషర్ పంప్‌ను ఉపయోగించే ఇళ్లకు కూడా ఇది ముఖ్యం.

Also Read: రూ.1,599కే..20000 mAh భారీ బ్యాటరీతో ఫిలిప్స్ పవర్ బ్యాంక్!

6. సరైన సామర్థ్యం:

మీ కుటుంబ అవసరాలను బట్టి మీ గీజర్ పరిమాణాన్ని ఎంచుకోండి.   కిచెక్ కోసం వేడి నీరు అవసరమైతే.. 3-లీటర్ల ఇన్‌స్టంట్ గీజర్ సరి పోతుంది. అయితే.. మీరు స్నానం చేయడానికి ఇష్ట పడితే, మీ కుటుంబంలో 3-4 మంది ఉంటే.. 10-25 లీటర్ల నిల్వ సామర్థ్యం గల గీజర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

7. వారంటీ:

అత్యంత ముఖ్యమైన అంశం వారంటీ. ట్యాంక్, హీటింగ్ ఎలిమెంట్‌పై కంపెనీ విడివిడిగా ఎన్ని సంవత్సరాల వారంటీని అందిస్తుందో చెక్ చేయండి. అలాగే.. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ ,విడిభాగాల ధర గురించి కూడా విచారించండి.

Related News

స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పి కొత్త ల్యాప్‌టాప్‌లు..పూర్తి ఫీచర్లలివే!

మార్కెట్‌లోకి రాకముందే ఇన్ని కఠినమైన పరీక్షలా? Samsung Galaxy Z Fold 8 వెనుకున్న ఈ కష్టం తెలిస్తే..

Google Payలో ఏఐ షాపింగ్ ఫీచర్.. నచ్చిన డ్రెస్‌ను ముందే ట్రై చేసే అవకాశం!

మళ్లీ ఇంత తక్కువ ధరకు దొరకవు.. అమెజాన్ సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై దిమ్మతిరిగే ఆఫర్లు!

బ్యాటరీ పాడైందని కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మార్చుకోండిలా!

అమెజాన్ దీపావళి ధమాకా.. రూ. 20 వేలలో 43 అంగుళాల 4K స్మార్ట్ టీవీలు.. ఇది కదా పండగ ఆఫరంటే!

వాట్సప్‌లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్.. కాల్ చేయాలన్నా, అడ్రస్ చూడాలన్నా ఇక చాట్‌లోనే!

Big Stories

Advertisement
×