E-Paper
Advertisement

ఇంత సన్నని ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఎలా పెట్టారబ్బా? యాపిల్‌కు చెమటలు పట్టిస్తున్న Huawei Mate 90 Air!

ఇంత సన్నని ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఎలా పెట్టారబ్బా? యాపిల్‌కు చెమటలు పట్టిస్తున్న Huawei Mate 90 Air!
Advertisement

Huawei Mate 90 Air: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పుడు స్లిమ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. iPhone Air తర్వాత ఈ విభాగంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో హువావే తమ కొత్త Mate 90 Air ఫోన్‌ను చైనాలో పరిచయం చేసింది. కేవలం 6.58 మిల్లీమీటర్ల మందంతో వచ్చిన ఈ ఫోన్‌లో పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ, మంచి కెమెరా సెటప్ ఉన్నాయి. సన్నని ఫోన్ అంటే బ్యాటరీ చిన్నదిగా ఉంటుందనే అభిప్రాయానికి ఇది భిన్నంగా కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం.

డిజైన్‌లో ప్రత్యేకత:

Mate 90 Air మందం 6.58 మిల్లీమీటర్లు మాత్రమే. మధ్య ఫ్రేమ్‌లో కొన్ని చోట్ల మందం 3.7 మిల్లీమీటర్లుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటివరకు వచ్చిన మేట్ సిరీస్ ఫోన్లలో ఇదే అత్యంత సన్ననిదని హువావే పేర్కొంది. గుండ్రని అంచులు, నైలాన్ ఫైబర్ మెటీరియల్‌తో ఫోన్‌కు కొత్త లుక్ ఇచ్చారు. వెనుక భాగంలో రెండు రంగుల ఫినిషింగ్, గ్లాస్ రక్షణతో కూడిన గుండ్రని కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. చేతిలో పట్టుకున్నప్పుడు తేలికగా, సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

7 అంగుళాల స్క్రీన్:

Advertisement

ఈ ఫోన్‌లో 7 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, యాప్‌ల మధ్య మారడం సాఫీగా సాగుతాయి. గరిష్ఠంగా 4,000 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 2160Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉంది. పనితీరు కోసం కిరిన్ 9020 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్, మెమరీ నిర్వహణ మెరుగుపడేందుకు ఆర్క్ ఇంజిన్, అల్ట్రా స్పేస్ కంటెంట్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి.

Also Read: ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!

బ్యాటరీ, కెమెరా:

Advertisement

సన్నని బాడీలో 6,500mAh బ్యాటరీ ఇవ్వడం ఈ ఫోన్‌లో మరో ఆకర్షణ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 23 గంటల వరకు వీడియోలు చూడొచ్చని హువావే తెలిపింది. 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వెనుక 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ మాక్రో, 12MP 3x టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. టెలిఫోటో కెమెరాకు OIS సపోర్ట్ ఇచ్చారు. రంగులను మెరుగ్గా గుర్తించేందుకు 1.5 మిలియన్ మల్టీస్పెక్ట్రల్ ఛానళ్లతో రెడ్ మేపుల్ సెన్సార్ ఉంది. ముందు 10.7MP కెమెరా అందించారు.

ధర ఎంతంటే?

చైనాలో 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.66,500. 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.79,700గా ఉంది. నలుపు సహా మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 24 నుంచి చైనాలో ప్రీ-సేల్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 4 నుంచి సాధారణ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో విడుదలపై కంపెనీ ఇంకా వివరాలు ప్రకటించలేదు. కాబట్టి ఇక్కడి ధర, లాంచ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!

Tags

Related News

ఇవి మామూలు ఇయర్ బడ్స్ కాదు.. మన మాటలన్నీ రికార్డ్ చేసి నోట్స్ రాసిపెట్టే ఏఐ గ్యాడ్జెట్!

రూ.1,499కే ఇయర్‌బడ్స్..మెటాలిక్ ఫినిష్,సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

రూ.963కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

BSNL క్రేజీ ఆఫర్.. రూ.399కే 60 Mbps స్పీడ్, 3,300GB డేటా.. పైగా మొదటి నెల బిల్లు ఫ్రీ!

వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?

రూ.902కే స్మార్ట్‌వాచ్..తక్కువ ధరకే పిచ్చెక్కించే ఫీచర్లు!

మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!

Big Stories

Advertisement
×