BSNL Rs 202 Plan: ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసిన తర్వాత, సామాన్య వినియోగదారులందరూ తక్కువ ధరలో వచ్చే బెస్ట్ ప్లాన్స్ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే బడ్జెట్ ప్లాన్స్ తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే వారికి, కొద్దిపాటి డేటా, కాలింగ్ అవసరాలు ఉన్నవారికి బీఎస్ఎన్ఎల్ వద్ద ఉన్న రూ.202 ప్రీపెయిడ్ ప్లాన్ ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలో ఈ స్పెషల్ టారిఫ్ వోచర్ (STV) అందుబాటులో ఉంది.
BSNL అందిస్తున్న ఈ రూ.202 ప్లాన్ మొత్తం 28 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో వినియోగదారులకు 300 నిమిషాల వాయిస్ కాలింగ్ లభిస్తుంది. అంటే ఇది అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ కాదు, పరిమిత నిమిషాలు మాత్రమే ఉంటాయి. డేటా విషయానికి వస్తే.. 28 రోజులకు గాను మొత్తం 5GB హై-స్పీడ్ డేటా ఇస్తారు. ఈ లిమిట్ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbpsకు తగ్గుతుంది. వీటితో పాటు మొత్తం 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి.
సాధారణంగా ఏ టెలికాం కంపెనీ కూడా తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లతో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఇవ్వదు. కానీ BSNL ఈ రూ.202 ప్లాన్‌లో వినియోగదారులకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని అందిస్తోంది. తక్కువ ధరలో కాలింగ్, డేటాతో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ లభించడం ఈ ప్లాన్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
Also Read: ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!
ఒకవేళ మీకు రూ.202 కూడా ఎక్కువ అనిపిస్తే.. BSNL వద్ద కేవలం రూ.99 చౌకైన ప్లాన్ కూడా ఉంది. ఇది ప్రస్తుతం భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర ప్లాన్. ఇందులో 14 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 50MB డేటా లభిస్తుంది. కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే ఎక్కువగా మాట్లాడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
రూ.99 ప్లాన్ కంటే కొంచెం ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారికి రూ.107 ప్లాన్ బెస్ట్ ఛాయిస్. ఇది 20 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని ఇస్తుంది. ఇందులో 3GB ఉచిత డేటా, 200 నిమిషాల వాయిస్ కాలింగ్ వస్తాయి. 3GB డేటా అయిపోయాక స్పీడ్ 40 Kbps కు పడిపోతుంది. తక్కువ ఖర్చుతో 4G నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలనుకునే వారికి ఈ మూడు ప్లాన్లు ఎంతో అనుకూలంగా ఉంటాయి.
Also Read: రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!