E-Paper
Advertisement

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే..మీ ఫోన్ 7 ఏళ్లు వాడొచ్చు!

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే..మీ ఫోన్ 7 ఏళ్లు వాడొచ్చు!
Advertisement

Long term software update: ప్రతి ఏడాది కొత్త స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ.. చాలామంది మాత్రం ఒకే ఫోన్‌ను కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడాలని కోరుకుంటారు. అలా ఎక్కువ కాలం ఫోన్ పాడవకుండా ఉండాలంటే కేవలం కెమెరా లేదా ఫాస్ట్ ప్రాసెసర్ చూస్తే సరి పోదు. ముఖ్యంగా .. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పాలసీని తప్పకుండా చెక్ చేయాలి, లేక పోతే కొద్ది సంవత్సరాలకే ఫోన్ స్లో అవడం, యాప్స్ పని చేయకపోవడం లేదా సెక్యూరిటీ సమస్యలతో.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫోన్‌ను 7 ఏళ్లు వాడాలనుకుంటే ..ఏమేం గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాఫ్ట్‌వేర్ , సెక్యూరిటీ అప్‌డేట్స్:

ఒక ఫోన్‌ను 7 ఏళ్లు వాడాలనుకుంటే ..మీరు ముందుగా చెక్ చేయాల్సింది OS (ఆపరేటింగ్ సిస్టమ్), సెక్యూరిటీ అప్‌డేట్ పాలసీ. ఇటీవలి కాలంలో.. కొన్ని ప్రముఖ బ్రాండ్లు తమ ఫ్లాగ్‌షిప్ , ఎంపిక చేసిన మోడళ్లకు 5 నుంచి 7 సంవత్సరాల పాటు అప్‌డేట్స్ అందిస్తున్నాయి. ఒక వేళ మీరు కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాల అప్‌డేట్ పాలసీ ఉన్న ఫోన్ కొంటే.. మూడేళ్ల తర్వాత ఆండ్రాయిడ్ లేదా iOS వెర్షన్ పాత బడిపోతుంది. దాని వల్ల కొత్త ఫీచర్లు రాకపోవడమే కాకుండా..బ్యాంకింగ్ యాప్స్ పని చేయకపోవడం, వైరస్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే లాంగ్-టర్మ్ అప్‌డేట్ హామీ ఉన్న ఫోన్‌ను ఎంచుకోవడం చాలా అవసరం.

బిల్డ్ క్వాలిటీ,డ్యూరబిలిటీ:

Advertisement

ఏడేళ్ల పాటు ఫోన్ మన చేతిలో.. సురక్షితంగా ఉండాలంటే.. దాని శారీరక దృఢత్వం కూడా బాగుండాలి. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మెటల్ లేదా దృఢమైన ఫ్రేమ్, కనీసం IP67 లేదా IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఫోన్లను ఎంచుకోవడం మంచిది. పొరపాటున నీళ్లలో.. పడినా లేదా కింద పడినా తట్టుకునే బిల్డ్ క్వాలిటీ ఉంటే..రిపేర్ ఖర్చులు తగ్గి ఫోన్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

స్టోరేజ్,ర్యామ్ కెపాసిటీ:

ఏడేళ్ల క్రితం ఉన్న యాప్స్ సైజు వేరు, రాబోయే ఏడేళ్లలో యాప్స్ , సిస్టమ్ ఫైల్స్ తీసుకునే స్పేస్ వేరు. కాలక్రమేణా ఫోటోలు, వీడియోలు, యాప్ డేటా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 7 ఏళ్లు వాడాలనుకునేవారు .. కనీసం 256GB లేదా అంతకంటే ఎక్కువ స్టోరేజ్ , తగినంత ర్యామ్ ఉన్న వేరియంట్‌ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. స్టోరేజ్ పూర్తిగా నిండిపోతే ఫోన్ నెమ్మదిస్తుంది.

బ్యాటరీ హెల్త్, ఛార్జింగ్ అలవాట్లు:

Advertisement

ఏడేళ్ల కాలంలో.. లిథియం-అయాన్ బ్యాటరీ సామర్థ్యం సహజంగానే కొద్ది కొద్దిగా తగ్గుతుంది. అందుకే.. బ్యాటరీ హెల్త్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ 100% ఛార్జ్ చేయడం .. లేదా 0% వరకు దించేయడం వంటివి తగ్గించి, 20% నుంచి 80% మధ్య ఛార్జింగ్ చేయడం మంచిది. అవసరమైనప్పుడు సర్వీస్ సెంటర్ ద్వారా ఒరిజినల్ బ్యాటరీ మార్చుకునే సౌకర్యం, స్పేర్ పార్ట్స్ ఈజీగా లభించే బ్రాండ్ అయితే ఏడేళ్ల ప్రయాణం మరింత ఈజీ అవుతుంది.

మీరు కొనే స్మార్ట్‌ఫోన్‌ను 7 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడాలనుకుంటే, ఆకర్షణీయమైన ఆఫర్ల కంటే ముందు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పాలసీ, బిల్డ్ క్వాలిటీ, స్టోరేజ్ వంటి అంశాలను తప్పకుండా పరిశీలించండి. సరైన నిర్ణయం తీసుకుంటే.. ఒకే ఫోన్‌తో ఏడేళ్ల పాటు స్మార్ట్ అనుభవాన్ని హాయిగా కొనసాగించవచ్చు.

Related News

BSNL రూ.202 ప్లాన్‌తో కళ్లు చెదిరే బెనిఫిట్స్.. డేటా, కాలింగ్‌తో పాటు ఉచిత ఇన్సూరెన్స్ కూడా!

ఇంత సన్నని ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఎలా పెట్టారబ్బా? యాపిల్‌కు చెమటలు పట్టిస్తున్న Huawei Mate 90 Air!

ఇవి మామూలు ఇయర్ బడ్స్ కాదు.. మన మాటలన్నీ రికార్డ్ చేసి నోట్స్ రాసిపెట్టే ఏఐ గ్యాడ్జెట్!

రూ.1,499కే ఇయర్‌బడ్స్..మెటాలిక్ ఫినిష్,సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

రూ.963కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

BSNL క్రేజీ ఆఫర్.. రూ.399కే 60 Mbps స్పీడ్, 3,300GB డేటా.. పైగా మొదటి నెల బిల్లు ఫ్రీ!

వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?

Big Stories

Advertisement
×