Realme Realfit 20000mAh Power Bank: మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైనదైనా సరే, బయటకు వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అయిపోతే ఆ టెన్షన్ అంతా ఇంతా కాదు! అందులోనూ పవర్ బ్యాంక్‌తో పాటు పొడవాటి కేబుల్స్ క్యారీ చేయడం పెద్ద తలనొప్పి. ఈ సమస్యకు చెక్ పెడుతూ రియల్‌మీ టెక్‌లైఫ్ సరికొత్త కాంపాక్ట్ పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన ‘యాంబర్ ఎల్లో’ కలర్, ఇన్‌బిల్ట్ కేబుల్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొడుతున్న ఈ పవర్ బ్యాంక్ ధర kp.2,799 గా ఉంది. దీని పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం!
సాధారణంగా 20,000 mAh పవర్ బ్యాంకులు అంటే చాలా బరువుగా, ఇటుక రాయిలా పెద్దగా ఉంటాయి. కానీ రియల్‌ఫిట్ దీనిని చాలా కాంపాక్ట్‌గా (కేవలం 359 గ్రాముల బరువుతో) డిజైన్ చేసింది. దీనిపైన ఉన్న 3D ట్రాన్స్‌పరెంట్ షెల్ డిజైన్ దీనికి ఒక ప్రీమియం, మోడ్రన్ లుక్‌ని ఇస్తుంది. ఇందులో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇన్‌బిల్ట్ డ్యూయల్-సైడెడ్ టైప్-సి కేబుల్. అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ఛార్జింగ్ వైర్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు! ఈ కేబుల్ ద్వారానే.. మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలాగే పవర్ బ్యాంక్‌ను కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. పవర్ బ్యాంక్‌లో ఇంకా ఎంత ఛార్జింగ్ మిగిలి ఉందో ఖచ్చితంగా చూపించడానికి ఒక స్మార్ట్ డిజిటల్ డిస్‌ప్లే కూడా ఇచ్చారు.
ఈ పవర్ బ్యాంక్ కేవలం ఫోన్ ఛార్జ్ చేయడానికే.. కాదు, మెరుపు వేగంతో ఛార్జ్ చేయడానికి తయారైంది. ఇది గరిష్టంగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం రియల్‌మీ ఫోన్లే కాకుండా శాంసంగ్, వన్‌ప్లస్, ఐఫోన్, ఐప్యాడ్, ట్యాబ్ కూడా చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 3 అవుట్‌పుట్ ఆప్షన్లు ఉన్నాయి. అవి..
1.ఒక ఇన్‌బిల్ట్ USB Type-C కేబుల్
2.ఒక అదనపు USB Type-C పోర్ట్
3.ఒక USB Type-A పోర్ట్
దీని ద్వారా మీరు ఒకేసారి మూడు డివైజ్‌లను (ఉదాహరణకు ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్) ఒకేసరి ఛార్జ్ చేసుకోవచ్చు. 20,000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ సామర్థ్యం ఉండటం వల్ల, ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు 3 నుండి 4 సార్లు ఫుల్ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కొనేటప్పుడు చాలామందికి.. బ్యాటరీ వేడెక్కుతుందేమో అనే భయం ఉంటుంది. అయితే ఇందులో 8-లేయర్ల సేఫ్టీ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఓవర్ ఛార్జింగ్, ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ వోల్టేజ్ వంటి సమస్యల నుంచి మీ ఫోన్‌ను, పవర్ బ్యాంక్‌ను ఇది పూర్తిగా రక్షిస్తుంది. అంతేకాకుండా ఇది BIS సర్టిఫైడ్, విమాన ప్రయాణాలకు పూర్తిగా అనుకూలమైనది. కాబట్టి ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా దీనిని మీ క్యాబిన్ బ్యాగ్‌లో తీసుకెళ్లొచ్చు.
Also Read: ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే..మీ ఫోన్ 7 ఏళ్లు వాడొచ్చు!
మార్కెట్లోఈ మోడల్ అసలు రిటైల్ ధర రూ. 2,799 గా నిర్ణయించారు (దీనిధర రూ.3,499 వరకు ఉంటుంది). ఇది ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్, ఆఫ్‌లైన్ మొబైల్ స్టోర్లలో కొనడానికి అందుబాటులో ఉంది. పండగ సీజన్ లేదా ప్రత్యేక సేల్స్ సమయాల్లో.. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఇది సుమారు రూ.1,899 నుంచి రూ.1,999 మధ్యలో కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనేముందు ఒకసారి ఆఫర్లు చెక్ చేసుకోవడం బెస్ట్. యాంబర్ ఎల్లోతో పాటు ఇది అబ్సిడియన్ బ్లాక్, గ్లేసియర్ వైట్ రంగుల్లో కూడా దొరుకుతుంది.
మీరు తరచూ ప్రయాణాలు చేసేవారైతే, కేబుల్స్ మోసే తలనొప్పి లేకుండా స్టైలిష్, ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలనుకుంటే రూ.2,799 బడ్జెట్‌లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.