Infinix 32 inch Smart TV: తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ టీవీ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే.. మీకోసమే ఒక క్రేజీ డీల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బ్రాండ్ ఇన్ఫినిక్స్ అందిస్తున్న 80 సెం.మీ (32 అంగుళాల) హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ లినక్స్ టీవీ ఇప్పుడు రూ.9,666 ఆఫర్ ధరతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బెజెల్-లెస్ డిజైన్, 20 వాట్ల డాల్బీ ఆడియో స్పీకర్లు, ప్రీ-ఇన్‌స్టాల్డ్ ఓటీటీ యాప్స్‌తో.. ఈ టీవీ అదరగొడుతోంది. ఈ టీవీ ఫీచర్లు, దీనిని ఎందుకు కొనాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ ఇన్ఫినిక్స్ 32 ఇంచుల (80 సెం.మీ) టీవీ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనికి.. చుట్టూ అంచులు లేని బెజెల్-లెస్ డిజైన్ ఇవ్వడం వల్ల టీవీ చూస్తున్నప్పుడు.. స్క్రీన్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది. 1366 బై 768 పిక్సెల్స్ హెచ్‌డీ రెడీ రిజల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో విజువల్స్ చాలా స్పష్టంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. అంతే కాకుండా దీనిలో 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటం వల్ల రూమ్ లోని ఏ మూలన కూర్చున్నా పిక్చర్ క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా చక్కగా కనిపిస్తుంది. చిన్న బెడ్రూమ్ లేదా హాల్‌కు ఈ సైజు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
సాధారణంగా తక్కువ ధరలో.. వచ్చే టీవీలలో సౌండ్ క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఇన్ఫినిక్స్ ఈ విషయంలో.. ఏమాత్రం రాజీ పడలేదు. ఇందులో 20 వాట్ల పవర్ ఫుల్ బాక్స్ స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల సినిమాలు చూస్తున్నా, పాటలు వింటున్నా, క్రికెట్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేస్తున్నా క్లియర్ సౌండ్‌తో పాటు మంచి బేస్ ఫీల్ కలుగుతుంది. ప్రత్యేకంగా హోమ్ థియేటర్ కొనాల్సిన అవసరం లేకుండానే రూమ్ మొత్తం సౌండ్ నిండిపోతుంది.
ఈ టీవీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బరువైన ఓఎస్‌లతో పోలిస్తే.. లినక్స్ ఓఎస్ చాలా తేలికగా ఉండి, ఎలాంటి హ్యాంగ్ లేదా లాగ్ లేకుండా వేగంగా పని చేస్తుంది. ఇందులో క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ టీవీలో యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్ వంటి పాపులర్ యాప్స్ ముందే.. ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. రిమోట్‌లోనే యూట్యూబ్, ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేక హాట్-కీస్ ఉండటంతో ఒక్క బటన్ నొక్కితే చాలు మీకు ఇష్టమైన షోలు ప్లే అవుతాయి.
కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో.. 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, బిల్ట్-ఇన్ వైఫై ,ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి. మీ స్మార్ట్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు.. స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ కూడా ఉంది. సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా పెన్ డ్రైవ్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. బాక్స్‌తో పాటే వాల్ మౌంట్, టేబుల్ స్టాండ్, స్మార్ట్ రిమోట్ ఉచితంగా వస్తాయి. కంపెనీ తరపున 1 సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.
Also Read: రూ.1,499కే ఇయర్‌బడ్స్..మెటాలిక్ ఫినిష్,సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
మొత్తం మీద రూ.10 వేల లోపు బడ్జెట్‌లో మంచి పిక్చర్ క్వాలిటీ, అద్భుతమైన సౌండ్ ,స్మార్ట్ ఫీచర్లు ఉన్న బ్రాండెడ్ టీవీ కావాలనుకునే వారికి ఇన్ఫినిక్స్ 32 అంగుళాల లినక్స్ టీవీ ఒక బెస్ట్ ఛాయిస్. పాత టీవీని మార్చాలనుకునే ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది పైసా వసూల్ డీల్ అని చెప్పొచ్చు.