E-Paper
Advertisement

రూ.500కే 48 గంటల బ్యాటరీ బ్యాకప్!అదిరిపోయే ఫీచర్లతో ఇయర్‌బడ్స్

రూ.500కే 48 గంటల బ్యాటరీ బ్యాకప్!అదిరిపోయే ఫీచర్లతో ఇయర్‌బడ్స్
Advertisement

MAGICMART Narvana Coach Earbuds: మంచి సౌండ్ క్వాలిటీ, డీప్ బేస్ ఉన్న వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలంటే.. కనీసం వెయ్యి రూపాయల పైనే ఖర్చు పెట్టాలని అందరూ అనుకుంటారు. కానీ కేవలం రూ.500 బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లు దొరికితే ఎలా ఉంటుంది? అవును, ఈ మోడల్ ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌సెట్ ఇప్పుడు మార్కెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. 48 గంటల సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, HD సౌండ్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అదిరి పోయే ఫీచర్లతో వచ్చిన ఈ గ్రే కలర్ ఇయర్‌బడ్స్ పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం!

పూర్తి ఫీచర్లు:

1. స్టైలిష్ డిజైన్ & కంఫర్ట్ ఫిట్:

చూడగానే ఆకట్టుకునే గ్రే కలర్ ఫినిషింగ్‌తో ఈ ఇయర్‌బడ్స్ చాలా క్లాసీగా, మోడ్రన్‌గా కనిపిస్తాయి. దీని ఛార్జింగ్ కేస్ చాలా తేలికగా, జేబులో ఈజీగా పట్టేంత కాంపాక్ట్‌గా ఉంటుంది. చెవుల్లో ..పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కుండా ఎర్గోనామిక్ డిజైన్‌తో రూపొందించారు. అంతే కుండా దీనికి IPX5 వాటర్ మస్వెట్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. అంటే మీరు..ర్కవుట్స్ చేస్తున్నప్పుడు చెమట పట్టినా లేదా తేలికపాటి వర్షపు చినుకులు పడినా ఈ బడ్స్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగదు.

2. సౌండ్ క్వాలిటీ, డీప్ బేస్:

Advertisement

ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో అతిపెద్ద హైలైట్ దీని ఆడియో పెర్ఫార్మెన్స్. ఇందులో హెచ్డీ సౌండ్ క్వాలిటీతో పాటు పవర్‌ఫుల్ డీప్ బేస్ టెక్నాలజీని ఇచ్చారు. పాటలు వింటున్నప్పుడు.. ప్రతి బీట్ చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది. మరో ముఖ్యమైన ఫీచర్ ENC. మీరు ట్రాఫిక్‌లో ఉన్నా, బయట రద్దీ ప్రదేశాల్లో ఉన్నా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి, అవతలి వారికి మీ వాయిస్ క్లియర్‌గా వినిపించేలా ఇందులోని మైక్రోఫోన్ పని చేస్తుంది.

3. 48 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్:

తక్కువ ధర ఇయర్‌ బడ్స్ కొన్నప్పుడు చాలామందికి.. వచ్చే ప్రధాన సమస్య బ్యాటరీ త్వరగా అయిపోవడం. కానీ ఈ మోడల్ ఈ విషయంలో ఏమాత్రం నిరాశపరచదు. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 48 గంటల ప్లేటైమ్ అందిస్తుంది. ఇందులో.. 300 mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జింగ్ టెన్షన్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.

4. కనెక్టివిటీ & లో-లేటెన్సీ గేమింగ్ మోడ్:

Advertisement

ఈ బ్లూటూత్ హెడ్‌సెట్ సుమారు 10 మీటర్ల వైర్‌లెస్ రేంజ్‌తో ఫాస్ట్, స్థిరమైన కనెక్టివిటీని ఇస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్లు, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లకు ఇది ఈజీగా కనెక్ట్ అవుతుంది. మొబైల్ గేమ్స్ ఆడే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ ఇచ్చారు. దీని వల్ల గేమ్ ఆడేటప్పుడు ఆడియో, వీడియో మధ్య ఎలాంటి ల్యాగ్ ఉండదు. గూగుల్ అసిస్టెంట్, సిరివాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో పాటు ఈజీగా కంట్రోల్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.

Also Read: రూ.1,499కే ఇయర్‌బడ్స్..మెటాలిక్ ఫినిష్,సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

5. ధర:

మార్కెట్లో ఈ మోడల్ అసలు రూ.1,999 గా ఉన్నప్పటికీ, భారీ డిస్కౌంట్ ఆఫర్లతో ఇది కేవలం రూ.491 నుంచి రూ.500 మధ్య ధరలోనే అందుబాటులో ఉంది. ప్రధాన ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్లలో ఇది కొనుగోలుకు లభిస్తుంది. అంతే కాకుండా ఈ ప్రొడక్ట్‌పై 1 సంవత్సరం డొమెస్టిక్ వారంటీ కూడా అందిస్తున్నారు. బాక్స్‌లో ఇయర్‌బడ్స్‌తో పాటు ఛార్జింగ్ కేబుల్, వారంటీ కార్డ్ వస్తాయి.

Related News

మీ ఫోన్ నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవ్వాలా? ఈ రియల్‌మీ కొత్త పవర్ బ్యాంక్ మీకోసమే

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే..మీ ఫోన్ 7 ఏళ్లు వాడొచ్చు!

BSNL రూ.202 ప్లాన్‌తో కళ్లు చెదిరే బెనిఫిట్స్.. డేటా, కాలింగ్‌తో పాటు ఉచిత ఇన్సూరెన్స్ కూడా!

ఇంత సన్నని ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఎలా పెట్టారబ్బా? యాపిల్‌కు చెమటలు పట్టిస్తున్న Huawei Mate 90 Air!

ఇవి మామూలు ఇయర్ బడ్స్ కాదు.. మన మాటలన్నీ రికార్డ్ చేసి నోట్స్ రాసిపెట్టే ఏఐ గ్యాడ్జెట్!

రూ.1,499కే ఇయర్‌బడ్స్..మెటాలిక్ ఫినిష్,సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

రూ.963కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

Big Stories

Advertisement
×