Big Stories

Nokia 3210 4G Launch: నోకియా ఈజ్ బ్యాక్.. లెజెండరీ ఫోన్‌తో రీ ఎంట్రీ..!

HMD Global going to Launch Nokia 3210 4G Mobile: 25 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రముఖ టెక్ కంపెనీ నోకియా సబ్ బ్రాండిగ్‌గా HMD  మార్కెట్‌లోకి వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ హెచ్ఎం‌డీ పల్స్ సిరీస్‌తో కెన్యాలో ఫోన్‌లను విడుదల చేసింది. వీటితో పాటు నోకియా 225 4Gని కూడా తీసుకొచ్చింది. అంతేకాకుండా త్వరలో నోకియా 3210ని లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ రెండు పల్స్ సరీస్‌కు భిన్నంగా ఉంటాయి. దీనికి సంబంధించిన సమాచారం Nokiamob వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

- Advertisement -

Nokiamob వెబ్‌సైట్ ప్రకారం నోకియా 25 ఏళ్ల తర్వాత లెజెండరీ ఫోన్‌ను మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త ఫోన్ 1999లో లాంచ్ అయిన ఒరిజినల్ నోకియా 3210 గుర్తుగా ప్రవేశపెట్టనున్నారు. అయితే పాత డిజైన్ కొత్త టెక్నాలజీతో ఈ మొబైల్ వస్తుంది. లీకైన చిత్రంలో కనిపించే కొత్త నోకియా 3210 నిజానికి 2021కి చెందిన నోకియా 6310 లానే ఉంది.

- Advertisement -

కొత్త ఫోన్‌లో లెటెస్ట్ కెమెరా బ్యాక్ ఫ్లాష్ లైట్ ఉంది. మీరు కొత్త నోకియా లోగోతో పాటు వెనుక వైపు HMD లోగోను కూడా చూడొచ్చు. డిజైన్ కాకుండా ఈ ఫోన్‌లో ఎక్కువ కాలం ఉండే బ్యాటరీ ఉంటుంది. బ్లూటూత్, 4G మొదలైన కొత్త కనెక్షన్లలు ఇందులో చూడొచ్చు. అంతేకాకుండా ఇందులో స్నేక్ గేమ్ కూడా ఉంటుంది. నోకియా 3210 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో ఒకటిన్నర అంగుళాల స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్‌పై, 84×48 పిక్సెల్స్ ఉన్నాయి. మొత్తం ఫోన్ 123.8 మిమీ పొడవు, 50.5 మిమీ వెడల్పు ఉంటుంది.

Also Read: 108 MP కెమెరా, 256GB స్టోరేజ్.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

ఈ ఫోన్‌లో 40 రకాల రింగ్‌టోన్‌లు ఉన్నాయి. వీటిని ఈ ఫోన్‌లో మాత్రమే ప్లే చేయవచ్చు. ఇది కాకుండా మీరు మీకు నచ్చిన రింగ్‌టోన్‌ను క్రియేట్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో మెమరీ కార్డ్‌ని ఇన్‌సర్ట్ చేయలేరు. ఇందులో ఇప్పటికే 3 ఆటలు గేమ్స్ కూడా యాడ్ చేశారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ స్టాండ్‌బై 55 నుండి 260 గంటలు పవర్ బ్యాక్ ఇస్తుంది. కాల్స్ మాట్లాడటానికి 180 నుండి 270 నిమిషాల వరకు ఉంటుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ 4 గంటలు పడుతుంది. ఫోన్‌లో రెండు బ్యాండ్‌లలో కనెక్టివిటీ ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News