BigTV English

Family Suicide in Kadapa : అవమానం భరించలేక.. ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్య

Family Suicide in Kadapa : అవమానం భరించలేక.. ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్య

Family Suicide in Kadapa(AP news live) : భర్త చేసిన అవమానాన్ని భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కడపజిల్లా కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం గంగాయపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కడపకు చెందిన ఉమామహేశ్వరి (45) భర్త ఎద్దుల శ్రీహరి కువైట్ లో ఉండేవాడు. తిరిగి ఊరికి వచ్చాక తాగుడుకి బానిసై.. భార్య, పిల్లల్ని వేధించడం మొదలు పెట్టాడు. అతడి వేధింపులు భరించలేక ఉమామహేశ్వరి, తన ఇద్దరు పిల్లలు ఫణికుమార్ (17), ధనలక్ష్మి (18)లతో చెన్నూరుకు చెందిన కే.ఆర్. ప్రసాద్ అన్న ఇంట్లో ఉంటున్నారు.


భర్తకు దూరంగా ఉంటున్న ఉమామహేశ్వరి.. పిల్లల్ని పోషించేందుకు డబ్బు కావాలని భర్తను కోరింది. కుదరదని చెప్పడంతో అతనిపై భరణం కేసు పెట్టింది. దీనిపై లాయర్లే పంచాయతీ చేసి.. ఆమెకు రూ.8 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. అందరి ముందు తన భార్య చెంపపై కొట్టి.. డబ్బులు ఇవ్వడం కుదరదని అందరి ముందు అవమానించాడు.

Also Read : ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజులో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య


భర్త అందరి ముందు చేసిన అవమానాన్ని భరించలేక, పిల్లల్ని పోషించే దారి కనిపించక మనస్తాపానికి గురైంది. పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్లొస్తానని చెప్పి వల్లూరు మండలం గంగాయపల్లి – బోరెడ్డిపల్లి గ్రామాలల మధ్యలో ఉన్న పొలాల్లో చెట్టుకు.. పిల్లలతో సహా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించి కేసు నమోదు చేశారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×