BigTV English

Honor 200 Series Launch: ఫ్రీగా హానర్ కొత్త ఫోన్లు, DSLR కెమెరా.. ఫీచర్ల చూస్తే వావ్ అంటారు!

Honor 200 Series Launch: ఫ్రీగా హానర్ కొత్త ఫోన్లు, DSLR కెమెరా.. ఫీచర్ల చూస్తే వావ్ అంటారు!

Honor 200 Series Launch: చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీ హానర్ దేశంలో రెండు పవర్‌ఫుల్ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈరోజు జూలై 18న హానర్ 200 సిరీస్‌ను విడుదల చేయబోతోంది. హానర్ 200 సిరీస్‌లో హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ అనే రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ హానర్ స్మార్ట్‌ఫోన్‌‌లలో అద్భుతమైన కెమెరా, ఏఐ పవర్డ్ ఫీచర్లు, బెస్ట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇవి క్వాడ్ కర్వ్‌డ్ డిజైన్‌తో వస్తున్నాయి. ఇది ప్రీమియం టచ్ ఫీల్‌ను అందిస్తోంది. మూన్‌లైట్ వైట్, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ అందుబాటులో ఉంటుంది. కెమెరా పర్ఫామెన్స్ గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్లు DSLR స్థాయి ఫోటోగ్రఫీని అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.


హానర్ 200 సిరీస్ హానర్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే 435PPI, హైపర్-డైనమిక్ కలర్ డిస్‌ప్లే టెక్నాలజీతో 2664×1200 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు అమెజాన్ హెచ్‌డిఆర్ సర్టిఫికేషన్, నెట్‌ఫ్లిక్స్ హెచ్‌డిఆర్ సర్టిఫికేషన్‌తో వస్తాయి. హెచ్‌డిఆర్ వివిడ్‌కు సపోర్ట్ ఇస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ 4nm ఆధారిత స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది.

హానర్ 200, 200 ప్రో 5జీ కెమెరా ఫీచర్లలో ట్రిపుల్ 50MP స్టూడియో రేంజ్ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటాయి. 50MP ప్రైమరీ కెమెరా OIS సపోర్ట్‌తో పెద్ద 1/1.56-అంగుళాల సోనీ IMX906 సెన్సార్‌తో వస్తుంది. 50MP టెలిఫోటో లెన్స్ హానర్ ఎక్స్ Sony IMX856 సెన్సార్‌తో 2.5x ఆప్టికల్, 50x డిజిటల్ జూమ్, f/2.4 ఎపర్చరుతో వస్తుంది. 112-డిగ్రీ FOV, 2.5cm అల్ట్రా-షార్ట్ ఫోకస్‌తో 12MP అల్ట్రా-వైడ్,  మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో మరో 50MP కెమెరా ఉంది. ఈ రెండిటిలో కాల్‌లు, వీడియోలకు ఏఐ ఫీచర్లు ఉంటాయి.

Also Read: Amazon Prime Day Sale: ఏమి ఆఫర్లు రా నాయనా.. సగం ధరకే ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లు.. ఒక్కరోజే ఛాన్!

హానర్ 200,  200 ప్రో 5G బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నిమిషాల్లోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఇది కాకుండా ఈ రెండు ఫోన్‌లలో కంపెనీ ‘ఆల్-న్యూ కూలింగ్ సిస్టమ్ 2.0’ ఉంటుంది. ఇది గేమ్‌లు ఆడటానికి, గ్రాఫిక్ వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్,  NFC సపోర్ట్ కలిగి ఉంటుంది.

 

అయితే కంపెనీ ఈ ఫోన్లను ఉచితంగా గెలుచుకొనే అవకాశం కల్పించింది. అందుకోసం మీరు ఫోన్ ధరను తెలియజేయాలని కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ చెప్పారు. కొన్ని నివేదికల ప్రకారం ఇండియాలో హానర్ 200 5G ధర దాదాపు రూ. 50,000, హానర్ 200 Pro 5G ధర రూ. 70,000 కంటే ఎక్కువగా ఉండవచ్చు. అయితే,అమెజాన్ ప్రైమ్ సేల్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందించే అవకాశం ఉంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×