BigTV English

Minister Anam comments on Jagan: జగన్‌పై మంత్రి ఆనం ఫైర్, ఆరు అడుగులు.. ఆ నలుగురు కోసమే..

Minister Anam comments on Jagan: జగన్‌పై మంత్రి ఆనం ఫైర్, ఆరు అడుగులు.. ఆ నలుగురు కోసమే..

Minister Anam comments on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పై తొలిసారి ఫైర్ అయ్యారు మంత్రి ఆనం రామనారాయణ‌రెడ్డి. ఉండేది ఇద్దరు పిల్లలని, నాలుగైదు ప్యాలెస్‌ లు ఉన్నాయని, ఇంకా దోపిడీ ఎవరి కోసమన్నారు. చివరకు ఏం సాధించావని ప్రశ్నించారు. జీవిత చివర లో మనకు కావాల్సింది ఆరు అడుగుల స్థలం, నలుగురు ఆప్తులు ఉంటే సరిపోతుందన్నారు. కనీసం జగన్ ఫ్యామిలీలో నలుగురు కుటుంబసభ్యులు కూడా లేరన్నారు.


నెల్లూరులో గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాదాయశాఖలో జగన్ సర్కార్ ఎలాంటి దోపిడీ చేసిందో తెలీదుగానీ, తొలిసారి పర్సనల్‌గా ఎటాక్ చేశారు. తాను ప్యాలెస్‌ టు ప్యాలెస్‌కు వెళ్తున్నారని మీడియాకు లీక్‌లిస్తే అందులో ఏమంటుందన్నారు. సొంత ప్యాలెస్‌లకు వెళ్తున్నావని, ప్యాలెస్ నుంచి పూరి గుడిసెకు వస్తే చెప్పుకోవచ్చారు.

ఒక ప్యాలెస్‌కు వెళ్లాలని ప్లాన్ చేశావని, ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం వల్ల వెళ్లలేక పోయావన్నారు దేవాదాయశాఖ మంత్రి. సింహాచలం లక్ష్మీనరసింహాస్వామి వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీలో ఇవాళ ఉన్న పరిస్థితి వల్ల తాడేపల్లి ప్యాలెస్‌కు రావని రాజకీయ విశ్లేషకుల ఆలోచనగా చెప్పుకొచ్చారు.


పనిలోపనిగా ట్విట్ట‌ర్ తాత‌య్య విజయసాయిరెడ్డి గురించి నోరువిప్పారు మంత్రి ఆనం. గతేడాది మే నెలలో శాంతి పెట్టిన ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. వారికి సంబంధించినది ప్రైవేటు కార్యక్రమంగానే ఉందన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన ప్రతీ రెవెన్యూ దందా వెనుక సుభాష్‌రెడ్డి, శాంతి ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పారు.

ALSO READ: వైసీపీ కార్యకర్త దారుణ హత్య..మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే?

మూడేళ్లుగా దేవాదాయశాఖ భూములను అమ్ముకోవడానికి ఎవరి ప్రమేయంతో పర్మీషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని, మా డిపార్ట్‌మెంటును రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×