Big Stories

Honor X7b 5G Launch: హానర్ నుంచి 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Honor X7b 5G
Honor X7b 5G

Honor X7b 5G Launching in Indian Market: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అనేది కామనైపోయింది. స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి ఉద్యోగాలు చేసే యువకుల వరకు స్మార్ట్‌ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఫోన్ల కంపెనీలు కూడా అధునాతమైన ఫీచర్లతో మార్కెట్‌లో మొబైల్స్‌ను తీసుకొస్తున్నాయి. జనాలు కూడా కొత్త ఫీచర్లతో వచ్చే ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ భారత్‌కు మూడేళ్లపాటు దూరంగా ఉండి వరుసబెట్టి స్మార్ట్‌ఫోన్లనే తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫోన్ Honor X7b 5G మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి కూడా తెలుసుకోండి.

- Advertisement -

డిస్‌ప్లే

ఈ ఫోన్ డిస్‌ప్లే గురించి చెప్పాలంటే.. Honor X7b 5Gలో 6.8 ఇంచెస్ ఐపిఎస్ ఎల్‌సీడీ ప్యానెల్,
2412 x 1080 పిక్సెల్స్ FHD+ రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది.

Also Read: సవక సవక.. ఈ రియల్ మీ 5జీ స్మార్ట్‌ఫోన్ చాలా సవక!

ప్రాసెసర్

Honor X7b 5G స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో వస్తోంది. 6020 చిప్‌సెట్‌ కలిగి ఉంటుంది.  Android 13 ఆధారిత MagicOS 7.2 వెర్షన్‌నపై పనిచేస్తుంది. ఫోన్ 8GB RAM+ 256GB స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది.

కెమెరా

హానర్ X7b 5G మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉండగా 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది మంచి క్వాలిటీ ఫోటోలను అందిస్తుంది.

Also Read: వదలొద్దు మచ్చా.. రూ.45 వేల నథింగ్ ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్!

బ్యాటరీ

Honor X7b 5G స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎమ్ఏహెచ్ బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో ఈ మొబైల్‌ రెండు రోజులు పాటు వస్తుంది. ఛార్జింగ్ కూడా వేగంగా ఎక్కుతుంది.

Honor x7b 5g ధర

Honor X7b 5G ధరను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, క్రిస్టల్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో తీసుకురానుంది. లాంచ్ డేట్ కూడా ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News