BigTV English

Vijay Devarakonda- Rashmika Mandanna: మళ్లీ అడ్డంగా దొరికేసిన టాలీవుడ్ ప్రేమ జంట..? ఈ సారి బర్త్ డే..

Vijay Devarakonda- Rashmika Mandanna: మళ్లీ అడ్డంగా దొరికేసిన టాలీవుడ్ ప్రేమ జంట..? ఈ సారి బర్త్ డే..
Rashmika Mandanna - Vijay Devarakonda
Rashmika Mandanna – Vijay Devarakonda

Vijay Devarakonda Celebrates Rashmika’s Birthday: ఇండస్ట్రీలో ఒకసారి.. కెమెరా కంటికి ఒక జంట కనిపిస్తే వారి గురించే ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక వారి మధ్య ప్రేమ.. పెళ్లి అంటూ గాసిప్స్ పుడుతూనే ఉంటాయి. వారు వాటిని ఎంత ఖండించినా కూడా ఫ్యాన్స్ నమ్మరంటే నమ్మరు. అలాంటి జంటల్లో మొదటి స్థానంలో ఉన్నారు విజయ్ దేవరకొండ- రష్మిక. వీరిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గతకొన్నేళ్ళుగా వినిపిస్తూనే ఉన్నాయి.


ఇప్పటివరకు ఈ పెళ్లి వార్తలపై వీరిద్దరూ స్పందించింది లేదు. అయితే అభిమానులకు ఎప్పటికప్పుడు ఈ జంటపై అనుమానంగానే ఉంటుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎప్పుడు ఈ జంట ఒకే దగ్గర కనిపిస్తూ వస్తున్నారు. వెకేషన్స్, పండగలు, పార్టీలు, హోటల్స్ ఇలా ఎక్కడకు జంటగా వెళ్లినా కూడా వాళ్లు పెట్టే ఫొటోస్ వెనుక లొకేషన్స్ ద్వారా అభిమానులు కనిపెట్టిస్తున్నారు. ఇప్పటికీ ఇలా చాలాసార్లు ఈ ప్రేమ జంట అడ్డంగా దొరికేశారు. ప్రస్తుతం విజయ్- రష్మిక దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఒక వీడియోను అభిమానుల కోసం షేర్ చేశాడు. అందులో పచ్చటి లాన్ మధ్యలో విజయ్ కూర్చొని ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ రాబోతుందని, తప్పకుండ చూడమని చెప్పుకొచ్చాడు. ఆ బ్యాక్ గ్రౌండ్ లో గమనిస్తే ఒక నెమలి అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తుంది.

Also Read: Vijay Devarakonda: ఐరన్ వంచలేదు మావా.. గట్టిగా దించాడు..?


ఇక ఈ వీడియో కన్నా ముందే రష్మిక అదే నెమలి ఫోటోను షేర్ చేస్తూ.. ఈ అందమైన బ్యూటీని చూడండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో సేమ్ నెమలి.. అయితే విజయ్- రష్మిక ఇద్దరూ ఒకచోటనే ఉన్నారు అని చెప్పుకొచ్చేస్తున్నారు. ఏప్రిల్ 5 న రష్మిక బర్త్ డేను విజయ్ దుబాయ్ లో సెలబ్రేట్ చేయనున్నట్లు సమాచారం. ఈ వీడియో చూసిన అభిమానులు ఇంకా ఎందుకు దాగుడుమూతలు.. అధికారికంగా ప్రకటించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×