BigTV English

Honor X9b: 108 మెగాపిక్సెల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

Honor X9b: 108 మెగాపిక్సెల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

Honor X9b Launched: ప్రస్తుతం కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ టెక్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు అద్భుతమైన మార్పులతో దర్శనమిస్తున్నాయి.


ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ తయారీ సంస్థ హానర్ అదిరిపోయే మొబైల్‌ను తీసుకొచ్చింది. ‘హానర్ ఎక్స్9బీ’ (Honor X9b) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:


ఇందులో 6.78 అంగుళాల 1.5కే కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. అయితే ఈ ఫోన్‌ను కేవలం ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులోకి తెచ్చారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో దీనిని తీసుకొచ్చారు. మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ వంటి కలర్ ఆప్షన్‌లలో దీనిని ఉంచారు.

READ MORE: ఒప్పో నుంచి మరో మిడ్‌రేంజ్ ఫోన్ లాంచ్.. ధర తక్కువ.. అదిరిపోయిన ఫీచర్లు..!

ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది. క్వాల్‌కాం 4ఎన్ఎం 6జెన్ 1 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 120 హెర్ట్జ్‌గా దీని స్క్రీన్ రిఫ్రెష్ రేటు ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలను అమర్చారు. ఇందులో మెయిన్ కెమెరా 108 మెగా పిక్సెల్ సామర్థ్యంతో వస్తుంది.

అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 5 మెగా పిక్సెల్‌తో.. మాక్రో సెన్సార్ కెమెరా 2 మెగా పిక్సెల్‌తో అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

5800 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. 35W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్‌ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

READ MORE: తక్కువ ధరలోనే నథింగ్ ఫోన్ (2a).. లాంచ్ ఎప్పుడంటే..?

ధర:

హనర్ ఎక్స్ 9బీ స్మార్ట్‌ఫోన్ మన దేశంలో 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించింది. దీనిని మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందించారు. ఇప్పటికే ఈ మొబైల్ సేల్ ప్రారంభమైంది.

అమెజాన్‌తో పాటు రిటైల్ స్టోర్లలో దీనిని కొనుక్కోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొంటే దాదాపు రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు.

ఇదిలా ఉంటే గతంలో రిలీజ్ చేసిన హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్‌ను అందించారు. దీని 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 ఉండగా.. ఇప్పుడు రూ.27,790 లకు తగ్గించారు. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.39,999 ఉండగా.. ఇప్పుడు రూ.26,850కి అందుబాటులో ఉంచారు.

Tags

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×