E-Paper
Advertisement

Viral Videos : జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..!

Viral Videos : జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..!
Advertisement

Woman Fighting Video Viral : సాధారణంగా మహిళలు కుళాయిల వద్ద లేదా ఇంటి వద్ద శుభ్రం చేసే క్రమంలో చెత్త గురించి గొడవ పెట్టుకుంటారు. కానీ విచిత్రంగా ఇద్దరు మహిళలు ఓ విషయంలో కొట్లాడుకున్నారు. ఏకంగా గంటలపాటు జట్టులు పీక్కుంటూ గుద్దుకున్నారు. చుట్టూ ఉన్న వారికి వినోదం పంచారు. ఇక అక్కడ ఉన్నవారు ఆగకుండా ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read More : పాములతో కెమెరాకి ఫోజులు.. వైరల్ వీడియో..!

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఇటీవల గాంధీ పార్క్‌ను ప్రారంభించారు. నగరంలో ఇదే అతిపెద్ద పార్క్ కావడం విషేశం. దీంతో జనాలు వీకెండ్ వస్తే ఎగబడుతున్నారు. పార్కును ఆధునికరించడంతో పాటు చిన్నపిల్లల కోసం ప్రత్యేక గేమ్ జోన్, టాయ్ ట్రైన్, సెల్ఫీ పాయింట్ వంటి వాటిని ఏర్పాటు చేశారు. దీంతో నగరం నలుమూలల నుంచి సందర్శకులు పార్క్‌కు చేరుకుంటున్నారు.

ముఖ్యంగా సెల్ఫీ పాయింట్ వద్ద విపరీతంగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్క్ రద్దీగా ఉన్న వేళ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు తీసేందుకు ఇద్దరు మహిళలు పోటీపడ్డారు. నేను ముందంటే నేను ముందు అని సవాల్ చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అనంతరం ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని దాడి చేసుకున్నారు.

Advertisement

Read More : ప్లాస్టిక్ పై పులి నేర్పిన పాఠం.. వైరల్ వీడియో..!

దాదాపు గంట పాటు వారి మధ్య వీరోచిత పోరాటం జరిగింది. కానీ ఆ ఇద్దరిని విడిపించేందుకు అక్కడున్న వారు ఎటువంటి సాహసం చేయలేదు. కనీసం సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి గొడవను ఆపలేదు. సుమారు గంటపాటు కొట్టుకున్న మహిళలు అలసిపోయి విరమించుకున్నారు.

అయితే అక్కడున్న వారు మహిళల భీకర పోరును తమ సెల్ ఫోన్లలో బంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు దాదాపు 4 వేల వ్యూస్ వచ్చాయి. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదగా నవ్వుకుంటూ.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×