Aadhaar Authentication History : ఆధార్.. ఓ భారతీయుడిగా గుర్తింపు పొందాలంటే ఉండాల్సిని కనీస గుర్తింపు కార్డు. ఈ రోజుల్లో ఆధార్ ఉపయోగం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ సేవలు, బ్యాంకు ఖాతాలతో పాటు ప్రతీ విషయంలో ఆధార్ ఉండాల్సిందే. ఇలా నిత్యం ఉపయోగించే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో కీలకంగా మారిన ఆధార్ కార్డు ప్రతిచోట అవసరం కావడంతో నెంబర్ ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ఆధార్ కార్డులో ఎక్కడెక్కడో వినియోగించడం వల్ల దుర్వినియోగం అయ్యిందేమో అనే అనుమానం కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. ఈ విషయం నిర్ధారణ చేసుకోవాలంటే తేలికైన విషయమే. నిజానికి ఆధార్ కార్డు హిస్టరీని తెలుసుకునే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే…
ఈ రోజుల్లో ఎంతో ముఖ్యమైన ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగించామో తెలుసుకోవడం ముఖ్యమైన విషయం. ఆధార్ తేలికగా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఆధార్ హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే( Adhar History) –
ఉడాయ్ పోర్టల్‌కు ను ఓపెన్ చెయ్యాలి.
My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar services క్లిక్ చేయాలి
Aadhaar Authentication History ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో లాగిన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయాలి
కిందకు స్క్రోల్ చేయగానే కనిపించే Authentication History ను క్లిక్ చేయాలి.
అక్కడ ALLని ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి
ఆపై Fetch Authentication History పై క్లిక్ చేయాలి.
ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ సహాయంతో ఆధార్ కార్డ్ హిస్టరీ తెలుసుకోవచ్చు
ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే మెత్తం డేటా ఇందులో కనిపిస్తుంది.
ఇక ఈ ఆధార్ హిస్టరీలో మీకు తెలియకుండా ఎక్కడైనా ఆధార్ ను వినియోగించినట్లు కనిపిస్తే వెంటనే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయ్యెచ్చు లేదా help@uidai.gov.inకి మెయిల్ చేయొచ్చు. వీటితో పాటు ఉడాయ్ వెబ్‌సైట్‌లో నేరుగా కంప్లెయింట్ చేయొచ్చు.
ఆధార్ దుర్వినియోగం జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆధార్‌కార్డ్‌ను బయోమెట్రిక్ లాక్ చేయాలి. దీంతో వ్యక్తి ప్రమేయం లేకుండా బయోమెట్రిక్‌ని ఉపయోగించేందుకు వీలుండదు. అయితే ఈ బయోమెట్రిక్ ను ఆన్‌లైన్‌లో తేలికగా చేసే అవకాశం ఉంటుంది.
బయోమెట్రిక్ లాక్ ఎలా చేయాలంటే (Adhar Biometri Lock) –
బయోమెట్రిక్ లాక్ కోసం ఉడాయ్ పోర్టల్ లోకి వెళ్లాలి.
ఆధార్ నంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
స్క్రీన్‌పై ఉన్న Lock/Unlock Biometric ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులో లాక్/అన్‌లాక్ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది.
ఆ పేజీలో కనిపించే Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్క్రీన్‌పై బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్‌కు సంబంధించి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
అందులో Lock Aadhaarని సెలెక్ట్ చేసుకోవాలి
ఆపై పూర్తి పేరు, వర్చువల్ ఐడీ,పిన్‌కోడ్, క్యాప్చా, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి
సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి
మీ రిజిస్టర్ట్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి.
ALSO READ : మరిచిపోయినా పంపాల్సిన సందేశాన్ని గుర్తు చేసే వాట్సాప్ నయా ఫీచర్… ఎలా పని చేస్తుందంటే!