BigTV English

Sandeep Reddy Vanga: బాహుబలి లాంటి సినిమా ట్రై చేస్తా

Sandeep Reddy Vanga: బాహుబలి లాంటి సినిమా ట్రై చేస్తా

Sandeep Reddy Vanga : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి సినిమాకి ఉన్న స్థాయి వేరు స్థానం వేరు. ప్రభాస్ కి మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి గుర్తింపు వచ్చేలా చేసిన సినిమా బాహుబలి. వాస్తవానికి ఆ సినిమాను ఊహించడమే చాలా కష్టతరమైన పని, అటువంటిది ఎస్.ఎస్ రాజమౌళి వెండి తెరపై ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటులకు ఉన్న మార్కెట్ వేరు. ఒక 100 కోట్ల సినిమా చేయడమే అప్పట్లో గగనం. అటువంటిది ప్రభాస్ చేస్తున్న సినిమాకు దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అనేది అప్పట్లో సంచలనాత్మకమైన విషయం. ప్రభాస్ కి కూడా అంత మార్కెట్ లేదు ఎలా రికవరీ అవుతుంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి తెలుగు సినిమా దశా దిశా రెండిటిని మార్చి వేసింది


బాహుబలి సినిమా కోసం ప్రభాస్ దాదాపు 5 సంవత్సరాలు టైం కేటాయించాడు. బాహుబలి లాంటి కథను నమ్మి అంత టైం కేటాయించాడు కాబట్టి నేడు ప్రభాస్ ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. అయితే బాహుబలి సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించి మంచి కలెక్షన్స్ రాబట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాను చేయనున్నాడు.

సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఒక మామూలు ప్రేమ కథను సందీప్ చెప్పిన విధానం చూపించిన విధానం చాలామందికి నచ్చింది. ఆ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గొప్ప దర్శకుడు దొరికాడు అని చాలామందితో అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ రాంగోపాల్ వర్మ చేసిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దానిలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ బాహుబలి లాంటి సినిమా నువ్వు అటెంప్ట్ చేయగలవా అని అడిగినప్పుడు.. నేను బాహుబలి లాంటి సినిమాను ట్రై చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ.సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు బాహుబలి లాంటి సినిమా తీయకపోయినా కూడా ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టగలిగే సినిమాను తీసే సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాలి. రన్బీర్ కపూర్ హీరోగా చేసిన అనిమల్ సినిమా 1000 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×