Whats App : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మాతృ సంస్థ మెటా.. తన వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మెసేజ్ డ్రాఫ్ట్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫీచర్ వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించి మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్.. ఈ యాప్ ఎప్పటికప్పుడు తన కస్టమర్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే పలు ఫీచర్స్ ను సైతం తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్. ఈ కొత్త ఫీచర్ iOS తో పాటు Androidలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని మెటా తెలిపింది.
వాట్సాప్ డ్రాఫ్ట్ ఫీచర్ – వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త డ్రాఫ్ట్ ఫీచర్ WhatsAppలో అసంపూర్తిగా ఉన్న మెసేజెస్ ను డ్రాఫ్ట్ లేబుల్ లో ఉంచుతుంది. వినియోగదారులు ఆ సమయంలో పంపలేని మెసేజెస్ ను ఆటోమెటిక్ గా సేవ్ చేస్తుంది. వీటిని చాట్ లిస్ట్‌లో పైన ఉంచుతుంది. వినియోగదారులు ఈ మెసేజెస్ ను ఆపేసిన చోట తిరిగి తేలికగా ప్రారంభిచగలిగే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్ ద్వారా అసంపూర్ణ సందేశాలు అదృశ్యం కాకుండా ఉంటాయని తెలుస్తుంది. అసంపూర్ణ సందేశాలను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక సందేశాన్ని రాసి మధ్యలో వదిలేస్తే అది సేవ్ అవుతుంది. ఇక వీలు ఉన్నప్పుడు తర్వాత సరి చూసుకొని పంపే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ iOS, Android ఫోన్‌లలో పనిచేస్తుంది.
డ్రాఫ్ట్ ఫీచర్‌తో వినియోగదారులు ఇకపై చాట్ లో ప్రతీసారి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. డ్రాఫ్ట్ ఐకాన్ కోసం నేరుగా సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్ వినియోగదారులు తమ యాప్‌ని అప్డేట్ చేస్తే మెసేజ్ డ్రాఫ్ట్ అందుబాటులోకి వస్తుంది. ఇక వాట్సాప్ యాక్టివిటీని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేయొచ్చు. అసంపూర్తిగా ఉన్న మెసేజ్‌లను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్ పై స్పందించిన వాట్సాప్ సీఈవో జూకర్ బర్గ్ ఈ ఫీచర్ అత్యవసరమని తెలిపారు. వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అవసరమయ్యే మెసేజ్లు కనిపించకుండా ఉండే అవకాశం ఉండదని తెలిపారు. ఇక వాట్సాప్ యాప్ ను మరింత మెరుగుపరచడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్న వాట్సాప్ ను భద్రంగా ఉంచడమే కాకుండా వినియోగదారుల సౌలభ్యం కోసం డిజైన్ చేయటం అత్యవసరమని జూకర్ బర్గ్ తెలిపారు.
ఇక ఈ యాప్ ను ఒక్క భారత్ లోనే 500 మిలియన్లకు పైగా యూజర్స్ ఉపయోగిస్తున్నారు. తాజాగా వాట్సాప్ అనుమానాస్పదంగా ఉన్న 65 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 12 మిలియన్ల ఖాతాలు తొలగించామని తెలిపారు. ఇక వాట్సాప్ వాట్సాప్ ఇప్పటికే డిస్పెపియర్ మెసేజెస్, మల్టీపుల్ డివైజ్ యాక్సెస్ వంటి పలు ఫీచర్స్ ను తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని ఫీచర్స్ ను సైతం తీసుకురాబోతుంది.
ALSO READ : పిచ్చెక్కించే ఫీచర్ తెచ్చేసిన ఐఫోన్.. ఇకపై హ్యాకర్స్ కు చుక్కలే