Fake Calls : దేశంలో మొబైల్ యూజర్స్ కు ఎక్కువగా ఎదురవుతున్న సమస్య ఫేక్ కాల్స్. తెలియని నెంబర్ల నుంచి కాల్స్ చేస్తూ స్కామర్స్ వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఫేక్ కాల్స్ ను ఎంతగా ఆపేందుకు ప్రయత్నిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. అయితే అసలు ఫేక్ కాల్స్ ఎందుకు వస్తాయి? వాటిని ఎలా ఆపాలి? అనే విషయం చాలామందికి తెలియదు.
ఫేక్ కాల్స్.. ఈ డిజిటల్ యుగంలో ఒక ట్రెండ్ గా మారిపోయింది. మోసం చేసేందుకు స్కామర్స్ ఎంచుకునే మొదటి మార్గంగా మారిపోయింది. ఈ ఫేక్ కాల్స్ మొబైల్ హ్యాక్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ కాల్స్ తో వ్యక్తిగత డేటాను దొంగలించడమే కాకుండా ఎన్నో మార్గాల్లో యూజర్స్ ను ట్రాప్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. బ్యాంకింగ్ మోసాలు, నకిలీ బహుమతులు, లాటరీలు అంటే ఫేక్ కాల్స్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఫేక్ కాల్స్ ను తేలికగా నివారించవచ్చు
ఫేక్ కాల్ గుర్తించండి –
తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయకూడదు. ఒకవేళ లిఫ్ట్ చేస్తే బ్యాంక్ లేదా ప్రభుత్వ ఉద్యోగిని అని చెబితే కచ్చితంగా అనుమానించాల్సిందే. బ్యాంకుకు సంబంధించిన వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే షేర్ చేయకూడదు. ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు.
వ్యక్తిగత సమాచారం భద్రం –
ఫోన్లో ఎంతో సున్నితపైన డేటా ఉంటుంది. అందుకే ఫోన్ కి సంబంధించి ఎలాంటి ఓటీపీ వచ్చినా కాల్స్ లో చెప్పకపోవడం మంచిది. ముఖ్యంగా బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఓటీపీలు లేదా డెబిట్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోవడం మంచిది. ఆధార్, కార్డు పాన్ కార్డు వంటివి ఎప్పుడూ మొబైల్ లో సమాచారం ఇవ్వకూడదు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా అడగరు అనే విషయాన్ని గుర్తించాలి.
గిఫ్ట్ లకు మోసపోవద్దు –
గిఫ్ట్స్ ఇస్తామంటూ మోసం చేస్తూ ఉంటారు. నిజానికి లాటరీ లేదా బహుమతులు ఇస్తామని కాల్ చేసే ప్రతీ ఒక్కరూ మోసగించాలనే ఉద్దేశంతోనే ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నకిలీ కాల్స్ ను నమ్మకుండా ఈ ఆఫర్స్ ను తిరస్కరించడమే మంచిది.
కాల్ బ్లాక్ –
తెలియని నెంబర్ల నుంచి పదేపదే కాల్స్ వస్తుంటే వాటిని బ్లాక్ చేయడం మంచిది. ఇక వాటిని రిపోర్ట్ చేస్తే మరొకరికి ఇలాంటి సమస్య ఎదురవ్వదు.
రిపోర్ట్ చేయండి –
ఫేక్ కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటే వాటిని రిపోర్ట్ చేసి 1909 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ లో రిపోర్ట్ చేయడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.
ఇక ఫేక్ కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటే మొబైల్ కి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఇలాంటి సమయంలోనే బ్యాంకు, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కు సమాచారం తెలియజేయాలి. బ్యాంకు ఖాతాకు చెందిన పాస్ వర్డ్స్ అన్నీ పగడ్బందీగా ఉంచుకోవాలి. నకిలీ కాల్స్ ప్రమాదాలు గురించి కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. సైబర్ సెక్యూరిటీ విషయాలపై తరచూ అప్డేట్ లో ఉండటం వల్ల ఇలాంటి వాటి నుంచి మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.
ALSO READ : స్మార్ట్ టీవీ ఆఫర్ లో కొనేస్తారా! అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ ఉందిగా!