Diwali lighting repair tips: ఇంటి అందాన్ని పెంచడంలో కరెంటుతో వెలిగే చిన్న చిన్న దీపాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దీపావళి, దసరా, వివాహ వేడకల సమయంలో ఇవి ఇళ్లకు అద్భుతమైన లుక్‌ని ఇస్తాయి. అయితే.. చాలా కాలం పాటు పక్కన పెట్టి మళ్లీ దీపావళికి.. వీటిని ఆన్ చేసినప్పుడు కొన్ని బల్బులు వెలగకపోవడం కామన్. ఇందుకు ప్రధాన కారణం వైరింగ్ లూజ్ కావడం, డస్ట్ పేరుకుపోవడం లేదా బల్బ్ బేస్ దగ్గర కార్బన్ పట్టడం కావచ్చు. కొత్త బల్బులు లేదా రిపేర్ కోసం ఎలక్ట్రిషియన్‌ను పిలిస్తే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అలా కాకుండా.. ఎవరి సహాయం లేకుండా మీ ఇంట్లోనే పాత బల్బులను ఎలా రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా ఎలక్ట్రికల్ రిపేర్ చేసే ముందు మొదటి, అత్యంత ముఖ్యమైన రూల్ పవర్ సప్లై ఆఫ్ చేయడం.బల్బులు ఉన్న వైర్ మెయిన్ స్విచ్‌ను పూర్తిగా ఆఫ్ చేయండి. ఒకవేళ వీలైతే మెయిన్ బోర్డ్ దగ్గర.. కరెంట్ కట్ చేయండి. సేఫ్టీ ముఖ్యం కాబట్టి చేతులకు గ్లౌజులు వాడటం మంచిది.
చాలా సార్లు బల్బులు పాడైపోవడానికి.. వాటిపై పేరుకుపోయిన ధూళి , దుమ్ము కారణం అవుతుంది. షాండిలియర్ నుంచి వెలగని బల్బులను చాలా జాగ్రత్తగా కిందకు తీయండి. వాటిని ఒక పొడి క్లాత్ తో నీట్ గా తుడవండి. బల్బ్ హోల్డర్ లోపల ఏమైనా చెత్త లేదా దుమ్ము ఉంటే చిన్న బ్రష్ సహాయంతో క్లీన్ చేయండి.
కొన్నిసార్లు షాండిలియర్ వైబ్రేషన్స్ వల్ల బల్బులు సరిగ్గా టైట్ చేసి ఉండవు. బల్బును హోల్డర్‌లో.. సరిగ్గా ఫిట్ చేసి క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో తిప్పండి. అలాగే.. షాండిలియర్ లోపలి వైరింగ్ ఏమైనా ఊడిపోయిందా లేదా అని గమనించండి. ఒకవేళ వైర్ లూజ్‌గా ఉంటే దానిని సరిగ్గా అడ్జస్ట్ చేయండి.
Also Read: 75 గంటల బ్యాటరీతో..గోబౌల్ట్ టెనెట్ ప్రో ఇయర్‌బడ్స్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోతుంది
బల్బ్ నిజంగానే కాలిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి మల్టీమీటర్ లేదా టెస్టర్ ఉపయోగించండి. బల్బ్ ఫిలమెంట్ తెగిపోయిందా లేదా అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఒక వేళ ఫిలమెంట్ దెబ్బతింటే మాత్రం ఆ ఒక్క బల్బును మార్చాల్సి ఉంటుంది. కానీ మొత్తం షాండిలియర్‌ను మార్చాల్సిన అవసరం లేదు.
బల్బ్ హోల్డర్ లోపలి కాంటాక్ట్ పాయింట్స్ కొద్దిగా లోపలికి వెళ్లిపోతే కరెంట్ అందదు. పవర్ ఆఫ్ చేసిన తర్వాత, చిన్న స్క్రూడ్రైవర్ సహాయంతో.. ఆ కాంటాక్ట్ పాయింట్‌ను కొద్దిగా పైకి లేపండి. దీని వల్ల బల్బ్ పెట్టగానే.. కరెంట్ సరిగ్గా అంది వెలుగుతుంది.
కొత్తవి కొనడానికి తొందరపడకుండా, కొంచెం ఓపిక చేసుకుంటే.. మన ఇంట్లోని. పాత షాండిలియర్‌ను మనమే చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా.. దీపావళికి మీ ఇంటిని మరింత కాంతివంతంగా మారుస్తుంది. మరి ఈ దీపావళికి మీ ఇంట్లోని పాత లైట్లను ఇప్పుడే చెక్ చేసి రెడీ చేసుకోండి!