E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!
Advertisement

WhatsApp Chat Preview: వాట్సప్ వాడే ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే చాట్ ప్రివ్యూ. సాధారణంగా వాట్సప్‌లో ఎవరైనా మెసేజ్ పంపితే.. దాన్ని చదవాలంటే ఆ చాట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా ఓపెన్ చేయగానే ఎదుటివారికి బ్లూ టిక్స్ కనిపిస్తాయి. కానీ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. చాట్ ఓపెన్ చేయకుండానే వచ్చిన మెసేజ్‌లను చదవొచ్చు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే పరిచయమైన ఈ సదుపాయాన్ని ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా మెటా సిద్ధం చేస్తోంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఇందులో ఎలాంటి ఆప్షన్లు ఉండనున్నాయి? తెలుసుకుందాం.

లాంగ్ ప్రెస్ చేస్తే చాట్ ప్రివ్యూ..

కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే చాట్ లిస్ట్‌లో మీకు కావాల్సిన వ్యక్తి లేదా గ్రూప్ పేరుపై కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయాలి. వెంటనే ఓ చిన్న ప్రివ్యూ విండో కనిపిస్తుంది. అందులో తాజాగా వచ్చిన మెసేజ్‌లను చూడొచ్చు. అంతేకాదు.. ఆ విండోలోనే పైకి, కిందికి స్క్రోల్ చేస్తూ మరిన్ని మెసేజ్‌లను కూడా చదవొచ్చు. దీనికోసం అసలు చాట్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

బ్లూ టిక్స్ పడే అవకాశం లేదు:

Advertisement

ఈ ఫీచర్‌లో అందరినీ ఆకట్టుకునే విషయం బ్లూ టిక్స్. చాట్‌ను ఓపెన్ చేయకుండా ప్రివ్యూలోనే మెసేజ్‌లు చదవొచ్చు కాబట్టి, వాటిని చదివినట్లు ఎదుటివారికి బ్లూ టిక్స్ వెళ్లవు. దీంతో వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేకుండా మెసేజ్ ఏమిటో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బిజీగా ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Also Read: బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!

ఒకేచోట ఎన్నో ఆప్షన్లు:

Advertisement

కేవలం మెసేజ్‌లు చదవడమే కాదు.. చాట్‌ను అక్కడి నుంచే మేనేజ్ చేసే అవకాశం కూడా ఉండనుంది. చాట్‌ను పిన్ చేయడం, ఆర్కైవ్ చేయడం, డిలీట్ చేయడం, చదివినట్లు మార్క్ చేయడం వంటి ఆప్షన్లు కనిపించనున్నాయి. అలాగే చాట్ లాక్ చేయడం, సమాచారం చూడటం, హోమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్ పెట్టుకోవడం వంటి సదుపాయాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

అందుబాటులోకి ఎప్పుడంటే?

ప్రస్తుతం ఈ Chat Preview ఫీచర్ డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. వాట్సప్ అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. బీటా యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు కూడా లేవు. టెస్టింగ్ పూర్తయ్యాక భవిష్యత్తు అప్‌డేట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటివరకు ఆండ్రాయిడ్ యూజర్లు వేచి చూడాల్సిందే. మొత్తానికి, చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదివే ఈ సదుపాయం వస్తే వాట్సప్ వాడకం మరింత సులభం కానుంది.

Also Read: మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!

Tags

Related News

రూ. 299 ప్లాన్ మళ్లీ తెచ్చిన ఎయిర్‌టెల్.. అయినా యూజర్లకు నిరాశే.. కారణం ఏంటో తెలుసా?

తక్కువ ధరలో బెస్ట్ డిష్ వాషర్ కావాలా ? వీటికంటే బెస్ట్ ఉండవు!

బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!

హార్డ్ వాటర్‌లోనూ బట్టలు మెరిపించే.. టాప్ 5 IFB ఫ్రంట్ లోడ్ మోడల్స్!

మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!

రూ.200 లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్.. Jio, Airtel, Vi వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఏది బెటర్ అంటే?

జియో కనివిని ఎరుగని ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 36 నెలలు తిరుగే లేదు.. అపరిమిత 5G, ఫ్రీ కాల్స్, ఓటీటీ సేవలు!

Big Stories

Advertisement
×