E-Paper
Advertisement

ఒక్కొక్కరికి 50 వేల డాలర్లు.. యూట్యూబర్లకు ఇన్‌స్టా బంపరాఫర్!

ఒక్కొక్కరికి 50 వేల డాలర్లు.. యూట్యూబర్లకు ఇన్‌స్టా బంపరాఫర్!
Advertisement

Instagram vs YouTube: యూట్యూబర్లకు Instagram ఏకంగా రూ.4.5 కోట్లకు పైగా ఆఫర్ చేస్తోంది. మీరు విన్నది నిజమే! YouTubeలో వీడియోలు చేసే క్రియేటర్లకు తమ ప్లాట్‌ఫామ్‌లో కూడా వీడియోలు పోస్ట్ చేయాలంటూ కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది. అసలు Instagram ఎందుకిలా చేస్తోంది? దీని వెనుక ఉన్న వ్యూహమేంటి?

తన ప్లాట్‌ఫామ్‌ను మార్చుకున్న Instagram

Advertisement

ఇప్పటివరకు Instagram అంటే మనకు గుర్తొచ్చేది ఫొటోలు, చిన్న చిన్న Reels. కానీ ఇప్పుడు Instagram తన ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇందులో భాగంగానే Features పేరుతో కొత్త లాంగ్ వీడియో ఫార్మాట్‌ను తీసుకొచ్చింది.

90 నిమిషాల లాంగ్ వీడియోలు..

Advertisement

ఈ ఫార్మాట్‌లో క్రియేటర్లు 90 నిమిషాల వరకు వీడియోలు అప్‌లోడ్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం చూసే Vertical వీడియోలకు భిన్నంగా Horizontal ఫార్మాట్‌లో ఈ వీడియోలు ఉంటాయి. అంటే YouTubeలో చూసే పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు, ట్రావెల్ వ్లాగ్స్, కామెడీ షోలు, సినిమా విశ్లేషణలు లాంటివి ఇప్పుడు Instagramలో కూడా చూసే అవకాశం ఉంటుంది. అయితే Instagram కొత్తగా ఈ ఫార్మాట్ తీసుకొచ్చినా.. వెంటనే అందులోకి పెద్ద మొత్తంలో కంటెంట్ రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది క్రియేటర్లు YouTubeలో లాంగ్ వీడియోలు చేస్తున్నారు. వాళ్లకు అక్కడ సొంతంగా ప్రేక్షకులు ఉన్నారు. ఆదాయం కూడా వస్తోంది. అందుకే Instagram నేరుగా యూట్యూబర్లనే టార్గెట్ చేసింది.

ఒక్కో క్రియేటర్‌కు రూ. 4.5 కోట్ల డీల్

ఇప్పటికే YouTubeలో వీడియోలు చేస్తున్న కొందరు ప్రముఖ క్రియేటర్లను సంప్రదించి.. Instagramలో కూడా తమ వీడియోలు పోస్ట్ చేయాలని కోరుతోంది. దీని కోసం ఒక్కో క్రియేటర్‌కు 50 వేల డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు ఆఫర్లు ఇస్తున్నట్లు Business Insider వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.45 లక్షల నుంచి రూ.4.5 కోట్లకు పైగా. ఈ విషయాన్ని Meta సంస్థ కూడా ధృవీకరించింది. అయితే ఈ డీల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచినట్లు తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ప్లాన్!

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. YouTube వదిలేసి Instagramకు రావాలని ఈ క్రియేటర్లను అడగడం లేదు. YouTubeలో ఎప్పటిలాగే వీడియోలు చేసుకోవచ్చు. అక్కడ వీడియో అప్‌లోడ్ చేసిన రోజే అదే వీడియోను Instagramలో కూడా పోస్ట్ చేయాలి. అంటే ఈ ఒప్పందాలు Exclusive కాదు.

Instagram మరో కొత్త వ్యూహం..

ఉదాహరణకు ఒక క్రియేటర్ గంటసేపు పాడ్‌కాస్ట్ చేశాడనుకోండి. అందులోని ఆసక్తికరమైన చిన్న చిన్న భాగాలను Reels రూపంలో పోస్ట్ చేయొచ్చు. ఆ Reel చూసిన ప్రేక్షకులు పూర్తి వీడియో చూడాలనుకుంటే Instagramలోనే ఆ లాంగ్ వీడియోకు వెళ్లొచ్చు.దీంతో ప్రేక్షకులు చిన్న వీడియో చూసి Instagram నుంచి YouTubeకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. పూర్తి కంటెంట్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌లో చూసే అవకాశం ఉంటుంది.అంతేకాదు.. Instagram ఇప్పుడు TV స్క్రీన్లపైనా తన వీడియో కంటెంట్‌ను విస్తరించాలని చూస్తోంది. ఎందుకంటే YouTubeకు ఉన్న పెద్ద బలం ఏంటంటే.. మొబైల్‌తో పాటు టీవీల్లో కూడా గంటల తరబడి వీడియోలు చూసే ప్రేక్షకులు ఉండటం.Instagram కూడా ఆ ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవాలనుకుంటోంది.

IGTV ఫ్లాప్ అయినా తగ్గని మెటా!

కానీ ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. YouTubeలో అర్హత సాధించిన క్రియేటర్లకు ప్రకటనల ఆదాయంలో వాటా ఇస్తుంది. కానీ Instagramలో ఈ కొత్త Features వీడియోలకు సంబంధించి అందరికీ వర్తించే సాధారణ Ad Revenue Sharing విధానం ఇంకా ప్రకటించలేదు. అందుకే ప్రస్తుతానికి కొందరు ప్రముఖ క్రియేటర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి కంటెంట్‌ను తీసుకొస్తోంది. భవిష్యత్తులో క్రియేటర్లు బ్రాండ్స్, అభిమానులు, Instagram ద్వారా ఎలా సంపాదించవచ్చనే మార్గాలను పరిశీలిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే Instagramకు లాంగ్ వీడియోలు కొత్తేమీ కాదు. 2018లో IGTV పేరుతో ఇలాంటి ప్రయత్నమే చేసింది. కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోవడంతో 2022లో దాన్ని నిలిపివేసింది.

భారీ ఆఫర్లతో YouTube

మొత్తానికి Instagram ఇప్పుడు కేవలం Reels చూసే యాప్‌గా ఉండిపోవాలని అనుకోవడం లేదు. YouTubeలో ఉన్న క్రియేటర్లు, వాళ్ల కంటెంట్, ప్రేక్షకులు.. ఇలా అన్నింటినీ తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ పోటీలో క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో లాంగ్ వీడియోల మార్కెట్‌లో YouTubeకు Instagram నుంచి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: దీపావళి చరిత్ర ఏమిటి? మన దేశంలో ఈ పండుగకు ఇన్ని కథలు ఎలా వచ్చాయి?

Tags

Related News

మీ గేమింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్‌కి..తీసుకెళ్లే బెస్ట్ ల్యాప్ టాప్స్!

40 కి.మీ. దూరంలోని రెస్టారెంట్ నుంచీ ఫుడ్ ఆర్డర్.. జొమాటో కొత్త ఫీచర్, 7 నగరాల్లో ప్రారంభం!

అద్భుతమైన ఫీచర్లతో..తోషిబా 4K టీవీ మోడల్స్ లాంచ్!

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!

రూ. 299 ప్లాన్ మళ్లీ తెచ్చిన ఎయిర్‌టెల్.. అయినా యూజర్లకు నిరాశే.. కారణం ఏంటో తెలుసా?

తక్కువ ధరలో బెస్ట్ డిష్ వాషర్ కావాలా ? వీటికంటే బెస్ట్ ఉండవు!

బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!

Big Stories

Advertisement
×